
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత AM రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మూడేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ పీరియాడికల్ డ్రామా ఇప్పుడు చివరి దశకి చేరుకుంది.మరో 30 రోజుల పాటు షూటింగ్ చేస్తే ఈ చిత్రం పూర్తి అవుతుంది. ఈ ఏడాది దీపావళి లేదా దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఆయన ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కేవలం 40 కోట్ల రూపాయిలు అట. అదేంటి పవన్ కళ్యాణ్ ఒక్క రోజు కాల్ షీట్ రెండు కోట్ల రూపాయిలు కదా, OG చిత్రానికి వంద కోట్లు తీసుకుంటున్నాడు, అలాంటిది ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి అంత తక్కువ ఎందుకు తీసుకుంటున్నాడు అనే సందేహం అందరిలో రావొచ్చు.
కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఒప్పుకొని సుమారుగా నాలుగేళ్లు అవ్వొస్తుంది.వకీల్ సాబ్ సినిమాతో పాటుగా ఈ చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.అప్పటికి మన టాలీవుడ్ స్టార్ హీరో రెమ్యూనరేషన్స్ 25 నుండి 35 మధ్యలో ఉండేది. పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు వంటి స్టార్స్ 40 కోట్లు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఆ టైం పీరియడ్ లో కమిట్ అయినా సినిమా కాబట్టే ఈ చిత్రానికి అంత తక్కువ రెమ్యూనరేషన్ అని అంటున్నారు విశ్లేషకులు.

మరో పక్క పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే షూటింగ్ ని పూర్తి చేసిన ‘వినోదయ్యా చిత్తం’ రీమేక్ కి కేవలం 30 రోజులకు గాను 60 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి 80 కోట్ల రూపాయిల పైమాటే, ఇప్పుడు OG కి వంద కోట్ల రూపాయిలు తీసుకుంటున్నాడు. ఈ టైం లైన్ లో ‘హరి హర వీరమల్లు’ సినిమాని ఒప్పుకొని ఉంటే పవన్ కళ్యాణ్ మరో వంద కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకునేవాడేమో అని అంటున్నారు ట్రేడ్ పండితులు.