
Chakri Brother Sensational Comments : టాలీవుడ్ లో దిగ్గజ సంగీత దర్శకులలో ఒకడు చక్రి.ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్ తో పాటుగానే ఇతని కెరీర్ కూడా ప్రారంభం అయ్యింది.పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన రెండవ సినిమా ‘బాచి’ చిత్రం ద్వారా చక్రి సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇడియట్ , ఇట్లు శ్రావణి స్రుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,దేశముదురు , నేనింతే , శివమణి , గోలీమార్ , 143 ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి.
ఈ చిత్రాలన్నీ కూడా మ్యూజికల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్.కేవలం పూరి జగన్నాథ్ కి మాత్రమే కాదు, ఇతర దర్శకులతో కూడా పనిచేసి ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ని అందించాడు చక్రి.అయితే దురదృష్టం కొద్దీ చక్రి 2014 వ సంవత్సరం లో గుండెపోటు తో మరిణించాడు.
ఇది ఇలా ఉండగా చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ రీసెంట్ గా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.తన అన్నయ్య చక్రి మరణం సహజమైనది కాదని,అది హత్య అన్నట్టు రీసెంట్ గా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘అన్నయ్య గారిది సాధారణమైన మరణం అయితే పోస్ట్ మార్టం కి ఎందుకు ఒప్పుకోలేదు?,పైగా మా అమ్మ విషం పెట్టి చంపింది అని కేసు పెట్టారు..అసలు అన్నయ్య చనిపోయిన రోజు నేను అమ్మ ఇంట్లోనే లేము.21 రోజుల నుండి బయట ఉన్నాము, అలాంటిది ఈ అబద్దపు కేసు పెట్టడానికి కారణం ఏమిటి.సొంత తల్లి ఎక్కడైనా బిడ్డని చంపుకుంటుందా..?,ఇప్పటికీ అన్నయ్య పేరు ఎత్తితే అమ్మ గుక్కపెట్టి ఏడ్చేస్తుంది, అంత ప్రేమ చక్రి అంటే, ఆరోజు రాత్రి అన్నయ్య ఎలా మరణించాడు అనేది ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలిపోయింది’ అంటూ మహిత్ నారాయణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.