
Dussehra Controversy : గత మూడు రోజుల క్రితం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబడుతున్న ‘దసరా’ చిత్రం ఇప్పుడు చిక్కులో పడింది.ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ఒక అంగనవాడి టీచర్ గా నటించిన విషయం సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ తెలుసు.ఒక సన్నివేశం లో ఈమె సందర్భానుసారంగా కోడి గుడ్లు మరియు టమోటాలు ఎవ్వరూ చూడకుండా దొంగతనం చేస్తుంది.ఈ సన్నివేశం చాలా ఫన్నీ గా ఉంటుంది.అయితే ఈ సన్నివేశాన్ని అర్జెంట్ గా తొలగించాలని లేకపోతే సినిమాని ఆపే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళు మూవీ టీం కి హెచ్చరికలు జారీ చేసారు.
ఎందుకంటే సరిగా జీతాలు కూడా తీసుకోకుండా, నిస్వార్థంగా పిల్లలకు చదువులు చెప్తున్న అంగనవాడి టీచర్స్ ని గౌరవిచాల్సిందిపోయి , ఇలా కించ పరిచేలా సన్నివేశాలు రాయడం ఏమాత్రం సబబు కాదని, వెంటనే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్షమాపణలు చెప్పి ఆ సన్నివేశాన్ని తొలగించాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది అంగనవాడి తెలంగాణ అసోసియేషన్.
సెన్సార్ బోర్డు వారీగా కూడా ఒక ఉత్తరం రాసారని, వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించకపోతే కోర్టుకి వెళ్తామని, పరిసితి తీవ్ర రూపం దాల్చేలా చేసి సినిమా థియేటర్స్ ఎదుట ధర్నాలు మరియు రాస్తారోకోలు చేసి మూవీ ని ఆపే వరకు నిద్రపోమని ఈ సందర్భంగా అంగనవాడి టీచర్లు వార్నింగ్ ఇస్తున్నారు.మరి ‘దసరా’ మూవీ టీం ఇందుకు క్షమాపణలు చెప్తుందో లేదో చూడాలి.కథ రీత్యా సందర్భానికి తగ్గట్టుగా కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి.
అలా ఎవ్వరీ మనోభావాలు దెబ్బతినకుండా సినిమాలు తియ్యడం అనేది అసాధ్యం.అలా చేస్తూ పోతే ఈరోజు మన తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు రేంజ్ కి ఎదిగేది కాదని అంటున్నారు విశ్లేషకులు.మరి దసరా సక్సెస్ సెలెబ్రేషన్స్ తో ఫుల్ జోష్ మీదున్న నాని, ఈ వివాదం పై స్పందిస్తాడా లేదా అనేది కూడా చూడాలి.