Star Hero Old Memory : ఈ ఫొటోలో చిన్న బాబు ఇప్పుడు స్టార్ హీరో.. పవన్ కల్యాణ్ పెద్ద ఫ్యాన్.. ఎవరో చెప్పుకోండి?

This Small Kid is now a Star Hero : మన చిన్నప్పటి విషయాలు పెద్దయ్యాక తెలుసుకోవాలంటే ఫొటోలు, వీడియోలే ఆధారం. ఒకప్పుడు వీడియో తీసుకోవడం సాధ్యం కాలేదు. అందుకే చాలా వరకు ఫొటోలు తీసుకొని స్టోర్ చేసేవారు. ఇప్పుడు సినిమాల్లో కొనసాగుతున్న కొందరు స్టార్ హీరోలు తమ చిన్నప్పటి పిక్స్ బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. లేటేస్టుగా ఓ స్టార్ హీరో బర్త్ డే సందర్భంగా తన చిన్నానాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో […]

Written By: Chai Muchhata, Updated On : April 2, 2023 11:36 am
Follow us on

This Small Kid is now a Star Hero : మన చిన్నప్పటి విషయాలు పెద్దయ్యాక తెలుసుకోవాలంటే ఫొటోలు, వీడియోలే ఆధారం. ఒకప్పుడు వీడియో తీసుకోవడం సాధ్యం కాలేదు. అందుకే చాలా వరకు ఫొటోలు తీసుకొని స్టోర్ చేసేవారు. ఇప్పుడు సినిమాల్లో కొనసాగుతున్న కొందరు స్టార్ హీరోలు తమ చిన్నప్పటి పిక్స్ బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. లేటేస్టుగా ఓ స్టార్ హీరో బర్త్ డే సందర్భంగా తన చిన్నానాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. తన అక్క వద్ద కూర్చుని అమాయకంగా చూస్తున్నా ఆ చిన్నోడు ఇప్పుడు పెద్ద స్టార్ హీరో. అంతేకాకుండా పవన్ కల్యాణ్ కు పెద్ద ఫ్యాన్. ఆ అభిమానానికి గుర్తుగా తన సినిమాలో పవన్ కల్యాణ్ సాంగ్ ఒకటి పెట్టుకున్నాడు. ఇప్పటికీ గుర్తు రాకపోతే కిందికి వెళ్లి తెలుసుకోండి..

పై ఫొటోలు ఉన్న చిన్న బాబు ఇప్పుడు కొనసాగుతున్న స్టార్ హీరో నితిన్. ఆయన చిన్నప్పుడు తన అక్క వద్ద కూర్చున్నాడు. ‘జయం’ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన నితిన్ హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నాడు. తాను ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘దిల్’ సినిమాతో స్టార్ హీరో అయ్యారు. మధ్యలో కొన్ని సినిమాలు కాస్త బ్రేక్ ఇచ్చినా మళ్లీ ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వరుస హిట్లతో మరోసారి తన ఫర్ఫామెన్స్ చూపించాడు. ఇలా సినిమాలో వరుసగా నటిస్తున్న నితిన్ ఇటీవల బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫొటో బయటకు తీశారు.

నితిన్ ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ అయినందున ఆయనకు సినిమాలపై ఆసక్తి ఉండేది. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించాలన్న కోరిక ఉంటేంది. పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమా వచ్చిన తరువాత పవన్ లాగా సాంగ్ లో నటించాలనుకున్నారు. అలా కొన్నేళ్ల తరువాత నితిన్ కోరిక మేరకు గుండెజారి గల్లంతయిందే సినిమాలో తొలిప్రేమ సాంగ్ ను రీమిక్స్ సెట్ చేశారు. ఇందులో నితిన్ అచ్చం పవన్ లాగే డ్యాన్స్ చేయడం విశేషం.

ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో నితిన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఓ ప్రాణాంతకమైన వ్యాధి సోకిన వ్యక్తిలా నితిన్ కనిపిస్తారని అంటున్నారు. నెలరోజుల్లో ఆ వ్యక్తి మరణిస్తాడని ముందే తెలిస్తే ఆ వ్యక్తి ఫీలింగ్ ఎలా ఉంటుంది? అనే కథాంశంతో ఈ సినిమా తీస్తున్నారట. ఇప్పటి వరకు నితిన్ ఇలాంటి కథల్లో నటించలేదు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్నారని అంటున్నారు.