
Allu Arjun- Nithiin: కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాలనే కాకుండా ఇతరుల జీవితాలను కూడా మార్చేస్తాయి.ఇది ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ లోనే జరుగుతుంది.ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చెయ్యడం, అది హిట్ అయ్యి ఆ హీరోని వేరే లెవెల్ కి తీసుకెళ్లడం వంటివి ఎన్నో సందర్భాలలో మనం చూసాము.హీరో నితిన్ విషయం లో కూడా అదే సంఘటన జరిగింది.
ఎక్కువగా యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నితిన్, కెరీర్ ప్రారంభం లో చేసిన ఒక్క చిన్న పొరపాటు హీరో అల్లు అర్జున్ కెరీర్ నే మార్చేసింది.ఇక అసలు విషయానికి వస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఆర్య సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఆరోజుల్లోనే ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.
అల్లు అర్జున్ ని స్టార్ హీరోగా మార్చిన ఈ చిత్రాన్ని నితిన్ వదిలేసుకున్నదే అట.మొదటి సినిమా జయం తోనే ఇండస్ట్రీ రికార్డ్స్ తో చెడుగుడు ఆదుకున్న నితిన్, ఆ తర్వాత చెయ్యాల్సిన సినిమా ఇదేనట.కానీ అప్పటికే ఆయన వీవీ వినాయక్ తో ‘దిల్’ అనే సినిమా కమిట్ అయిపోయాడు.అందుకే డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ఆర్య సినిమాని వదులుకోవాల్సి వచ్చింది.దిల్ సినిమా కూడా నితిన్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిల్చింది కానీ, ఆయనని మరో లెవెల్ కి తీసుకెళ్లలేకపోయింది.అదే ఆర్య సినిమా చేసి ఉంటే కచ్చితంగా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగేవాడని విశ్లేషకుల అభిప్రాయం.

ఇక ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే లేటెస్ట్ గా ఆయన హీరో గా నటించిన ‘మాచెర్ల నియోజకవర్గం’ అనే సినిమా డిజాస్టర్ అవ్వడం తో, ఇక నుండి స్క్రిప్ట్ ఎంపిక లో ఆచి తూచి అడుగులేస్తున్నారు.ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు నితిన్.ఈ చిత్రం కచ్చితంగా తన కెరీర్ ని మలుపు తిప్పుతుందని బలమైన నమ్మకం తో ఉన్నాడు.