
Sir OTT Release Date: ధనుష్ హీరో గా నటించిన మొట్టమొదటి తెలుగు సినిమా ‘సార్’ ఇటీవలే థియేటర్స్ లో భారీ లెవెల్ హైప్ తో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.విద్య ఎవడబ్బా సొత్తు కాదు, ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉండాలి అనే గొప్ప కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి మలిచిన తీరు ఎంతో అద్భుతంగా ఉంది.ఇలాంటి సినిమాలు జనాలకు కనెక్ట్ అవ్వాలంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఎమోషన్ కూడా ఉండాలి.
ఆ రెండు సరిగ్గా సమపాళ్లలో కుదిరితేనే బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్ అవుతాయి.ఈ సినిమా విషయం లో డైరెక్టర్ వెంకీ అక్కడే సక్సెస్ సాధించాడు.ఫలితం ఈరోజు మన అందరం చూస్తున్నాం.కేవలం ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి మూడు రోజుల్లో 9 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.
కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాకి రెండు భాషలకు కలిపి ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందట.నిన్న వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లే వచ్చాయి.ఊపు చూస్తుంటే మొదటి వారం లోనే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయిలు కొల్లగొట్టే రేంజ్ లో అనిపిస్తున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి 20 కోట్ల రూపాయలకు రైట్స్ ని సొంతం చేసుకుందట.వచ్చే నెల 22 వ తారీఖున ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.థియేటర్స్ కి వెళ్ళడానికి బద్దకించి ఓటీటీ రిలీజ్ తేదీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ న్యూస్ పండగలాంటిదే అని చెప్పొచ్చు.