ఇంట్లో ఏ చెట్లు ఉండకూడదో తెలుసా?

ఇల్లు, చెట్టు ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. చెట్ల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే మన ఇంటికి దగ్గరలో కొన్ని చెట్లు ఉంటే మేలు జరుగుతుంది. అదే సమయంలో కొన్ని చెట్లు ఉంటే మాత్రం మంచిది కాదు. ఆ చెట్లు చెడ్డవి కాకపోయినా వాటి వల్ల మనకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు కాబట్టి ఆ చెట్లు లేకపోతేనే మంచిది. కొన్ని చెట్లు దుష్ప్రభావం కలిగిస్తాయి. Also Read : ట్ర‌య‌ల్స్ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 21, 2020 2:20 pm
Follow us on

ఇల్లు, చెట్టు ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. చెట్ల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే మన ఇంటికి దగ్గరలో కొన్ని చెట్లు ఉంటే మేలు జరుగుతుంది. అదే సమయంలో కొన్ని చెట్లు ఉంటే మాత్రం మంచిది కాదు. ఆ చెట్లు చెడ్డవి కాకపోయినా వాటి వల్ల మనకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు కాబట్టి ఆ చెట్లు లేకపోతేనే మంచిది. కొన్ని చెట్లు దుష్ప్రభావం కలిగిస్తాయి.

Also Read : ట్ర‌య‌ల్స్ ప్రారంభం: క‌రోనాకు ఆయుర్వేద మందు..!

దుష్ప్రభావం కలిగించే చెట్లు మన ఇంటికి సమీపంలో ఉంటే ఇంట్లో ఉండే వాళ్లు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంట్లో ముళ్లు ఉండే చెట్లు, పాలు కార్చే చెట్లు ఎట్టి పరిస్థితుల్లోను ఉండకూడదు. ఇంటి ఆవరణలో తుమ్మ చెట్లను, రేగు పండ్ల చెట్టులను కూడా పెంచకూడదు. ఈ చెట్లు ఇప్పటికే ఇంటి సమీపంలో ఉంటే వీలైనంత త్వరగా తొలగిస్తే మంచిది. ప్రతికూల ప్రభావం చూపించే ఈ చెట్లు ఇంటి ఆవరణలో ఉంటే చేసే పనుల్లో ఏకాగ్రత లోపించడంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి.

పొడవాటి, సగం ఎండిన, సగం కాలిన వృక్షాలు కూడా సమీపంలో ఉండకూడదు. ఈ చెట్లు ఉంటే ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. ఈ చెట్లు పిల్లల చదువు, సక్సెస్ పై కూడా ప్రభావం చూపుతాయి. చింత, మర్రి లాంటి చెట్లు దుష్ట శక్తులను ప్రేరేపిస్తాయి. ఈ చెట్లపై దుష్ట శక్తులు ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. అందువల్ల ఇంటి పరిసరాల్లో ఈ చెట్లు ఎట్టి పరిస్థితుల్లోను ఉండకుండా జాగ్రత్త పడాలి. పెద్దపెద్ద వృక్షాలను ఇండ్లలో పెంచుకుంటే ఇంటి గోడలు, పునాదులు కదిలే అవకాశం ఉంది. అలాంటి చెట్లను పొలాల్లో, ఊరి బయట పెంచితే మంచిది.

Also Read : బంగారం ప్రియులకు శుభవార్త… 5 రూపాయలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం…?