Homeజాతీయ వార్తలుఏపీ కంటే తెలంగాణకే బీజేపీ చూపు.. ఎందుకు?

ఏపీ కంటే తెలంగాణకే బీజేపీ చూపు.. ఎందుకు?


ఉమ్మడి ఏపీ విడిపోయాక.. తెలంగాణ, నవ్యాంధ్ర ఏర్పడ్డాయి. ఆరేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలోనే నీటి పంచాయితీలు మొదలయ్యాయి. కృష్ణా జలాల వివాదం.. అన్నాదమ్ముల వలే కొనసాగుతున్న ఇరురాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. ఇరుప్రాంతాల ముఖ్యమంత్రులు తమ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉండటంతో జలవివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. అగ్నికి అజ్యం పోసినట్లుగా కేంద్రం ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు యత్నిస్తుండటం తెలుగు రాజకీయాలను వేడెక్కిస్తోంది.

Also Read: జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

అటూ తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటూ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సాగునీటికే ప్రాధాన్యమిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని తరలించి రాయలసీమలో కరువుఛాయలు దూరం చేసేందుకు భగీరథ యత్నాలు జగన్ మొదలుపెట్టారు. దీన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది.

దీంతో ఏపీ, తెలంగాణ జలవివాదంలో బీజేపీ ఎటువైపు నిలుస్తుంది.? ఏ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తుంది? చాలామంది రాజకీయ మేధావులను తొలుస్తున్న ప్రశ్న ఇదీ..

బీజేపీ ప్రస్తుతం జాతీయ పార్టీగా.. దేశాన్ని ఏలుతున్న పార్టీగా అన్ని రాష్ట్రాల్లో ఎదగాలని కోరుకుంటోంది. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం ఏపీ, తెలంగాణ మధ్య ఏ రాష్ట్రాన్ని ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే ఏపీని పక్కనపెట్టి తెలంగాణకే మొగ్గు చూపుతోంది.

కృష్ణా నది జలవివాదంలో బీజేపీ మద్దతు తెలంగాణ రాష్ట్రానికే ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ బలంగా ఉంది. బీజేపీకి కనీసం 1శాతం ఓటు బ్యాంకు కూడా లేదు. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీలో దాదాపు సున్నాగానే ఉంది. 2024నాటికి తిరిగి పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

కానీ తెలంగాణలో బీజేపీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. బలమైన క్యాడర్ ఉంది. మొన్నటి ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కుదేలు అవుతున్న వేళ తెలంగాణలో నంబర్ 2గా పార్టీ ఎదగడానికి ప్రయత్నిస్తోంది.

Also Read: మోడీ బాటలో పవన్ ?

కాబట్టి నీటి వివాదంలో ఏపీ కంటే తెలంగాణ వాదనలకే బీజేపీ మద్దతు ఇస్తోంది. అందుకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపాలని బీజేపీ తెలంగాణ నేతలు లేఖ రాయగానే.. కేంద్రం ఈ ప్రాజెక్టును ఆపాలంటూ అనుమతి లేదని పేర్కొనడం విశేషం.

మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్ర బిజెపి మౌనంగా ఉంది, ఇక్కడ తెలంగాణ బీజేపీ శాఖ మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ప్రణాళికాబద్ధమైన వ్యూహంలో భాగం అని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఓటర్ల సానుభూతి.. మద్దతు పొందాలనే బీజేపీ.. ఏపీ కంటే తెలంగాణ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని అర్థమవుతోందంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version