బంగారం ప్రియులకు శుభవార్త… 5 రూపాయలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం…?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ పసిడి ప్రియులకు శుభవార్త చెప్పింది. అమెజాన్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం అమెజాన్ పే ద్వారా కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గోల్డ్ వాల్ట్ పేరుతో డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫీచర్ ను తాజాగా అమెజాన్ లాంచ్ చేసింది. ఇందుకోసం అమెజాన్ సేఫ్ గోల్డ్ సంస్థతో గోల్డ్ డిపాజిట్ సర్వీసుల కొరకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్ 5 రూపాయల నుంచి డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. Also Read […]

Written By: Kusuma Aggunna, Updated On : August 21, 2020 2:18 pm
Follow us on

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ పసిడి ప్రియులకు శుభవార్త చెప్పింది. అమెజాన్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం అమెజాన్ పే ద్వారా కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గోల్డ్ వాల్ట్ పేరుతో డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫీచర్ ను తాజాగా అమెజాన్ లాంచ్ చేసింది. ఇందుకోసం అమెజాన్ సేఫ్ గోల్డ్ సంస్థతో గోల్డ్ డిపాజిట్ సర్వీసుల కొరకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్ 5 రూపాయల నుంచి డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.

Also Read : ఇంట్లో ఏ చెట్లు ఉండకూడదో తెలుసా?

గూగుల్ పే, మొబిక్విక్, ఫ్రీచార్జ్ , ఫోన్ పే, పేటీఎం లాంటి సంస్థలతో తాజా సర్వీసుల వల్ల అమెజాన్ పోటీ పడనుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచి సులభంగా డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెజాన్ అకౌంట్ కలిగి ఉన్నవారు మరింత సులభంగా డిజిటల్ అకౌంట్ ను కొనుగోలు చేయవచ్చు. ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతో గోల్డ్ ను కొనుగోలు చేయడంతో పాటు అవసరమైతే దానిని విక్రయించవచ్చు.

మొదట పేటీఎం డిజిటల్ గోల్డ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అనంతరం ఫోన్ పే డిజిటల్ గోల్డ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థలు మూడేళ్ల క్రితమే డిజిటల్ గోల్డ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాగా అమెజాన్ తాజాగా ఈ సర్వీసులోకి అడుగుపెట్టింది. ఏ రంగంలో అడుగు పెట్టినా శరవేగంగా దూసుకెళుతున్న అమెజాన్ ఈ రంగంలో కూడా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. మొబిక్విక్ 2018లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాగా గూగుల్ పే 2019లో ఈ సర్వీసులను లాంచ్ చేసింది.

Also Read : ట్ర‌య‌ల్స్ ప్రారంభం: క‌రోనాకు ఆయుర్వేద మందు..!