Das Ka Dhamki collections : రోజురోజుకి తగ్గిపోతున్న ‘దాస్ కా ధమ్కీ’ వసూళ్లు.. పాపం విశ్వక్ సేన్

Das Ka Dhamki collections : ఈమధ్య కాలం లో భారీ అంచనాల నడుమ విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకొని కూడా ఓపెనింగ్స్ లో దుమ్ము లేపేసిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’.విశ్వక్ సేన్ హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఇలా త్రిపాత్రాభినయం చూపించిన ఈ చిత్రానికి మొదటి రోజు 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి కానీ,రెండవ రోజు నుండి వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. నిజం చెప్పాలంటే మొదటి రోజు వచ్చిన నెగటివ్ టాక్ సాయంత్రం […]

Written By: NARESH, Updated On : March 24, 2023 11:27 pm
Follow us on

Das Ka Dhamki collections : ఈమధ్య కాలం లో భారీ అంచనాల నడుమ విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకొని కూడా ఓపెనింగ్స్ లో దుమ్ము లేపేసిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’.విశ్వక్ సేన్ హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఇలా త్రిపాత్రాభినయం చూపించిన ఈ చిత్రానికి మొదటి రోజు 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి కానీ,రెండవ రోజు నుండి వసూళ్లు భారీగా తగ్గిపోయాయి.

నిజం చెప్పాలంటే మొదటి రోజు వచ్చిన నెగటివ్ టాక్ సాయంత్రం షోస్ తోనే పోయింది.కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ రెండవ రోజు వసూళ్లను మాత్రం హోల్డ్ చెయ్యలేకపోయింది ఈ చిత్రం.చాలా చోట్ల ‘రంగమార్తాండ’ కంటే తక్కువ వసూళ్లను రాబట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది.ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమాని అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఒక చిన్న సినిమా డామినేట్ చెయ్యడం అంటే సాధారణమైన విషయం కాదు.

ముఖ్యంగా నైజాం వంటి ప్రాంతాలలో ‘ధమ్కీ’ వసూళ్లు దారుణంగా పడిపోయాయి.వీకెండ్ అప్పుడైనా కోలుకుంటుందా అంటే అనుమానమే అంటున్నారు ట్రేడ్ పండితులు.మూడు రోజులకు కలిపి 6 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ సాధించేందుకు కోసం మరో 75 లక్షల రూపాయిలు మాత్రమే ఉంది.ఈ వీకెండ్ తోనే అది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

నిర్మాతగా విశ్వక్ సేన్ కి కానీ, బయ్యర్స్ కి కానీ రూపాయి నష్టం కూడా లేదు, లాభాలే కానీ విశ్వక్ సేన్ ఈ చిత్రం తో మరో లెవెల్ కి వెళ్ళాలి అనుకున్నాడు.అది ఈ సినిమాతో కూడా సాధ్యపడలేదు,మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్ ని చూసి కచ్చితంగా ఈ సినిమా ఫుల్ రన్ 20 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరుతుందని అనుకున్నారు.కానీ అది దాదాపుగా అసాధ్యమే, ఇప్పుడు పది కోట్ల రూపాయిలు వస్తే చాలని అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు.