https://oktelugu.com/

TollyWood : మన స్టార్ హీరోలు చేస్తున్న ఈ సీక్వెల్ సినిమాల్లో ఏ మూవీ భారీ సక్సెస్ ను కొట్టబోతోంది..?

అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీద అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక మొదటి పార్ట్ ఎంతటి విజయన్నైతే సాధించిందో, రెండో పార్ట్ అంతకుమించి విజయాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది

Written By:
  • Gopi
  • , Updated On : July 17, 2024 / 07:03 PM IST
    Follow us on

    TollyWood :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా ఎక్కువైంది. ప్రస్తుతం చాలా సినిమాలు సీక్వెల్స్ కి రెడీ అవుతున్నాయి. ఇక అందులో భాగంగానే కొన్ని సినిమాల సీక్వెల్స్ లు ఇప్పటికే రిలీజ్ అవ్వగా, ఇప్పుడు మరికొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఇలాంటి నేపథ్యంలోనే హీరోలందరూ కూడా తమ తమ సినిమాలతో సక్సెస్ లను అందుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా ‘పుష్ప 2’ సినిమా మీద ప్రస్తుతానికైతే మంచి అంచనాలు ఉన్నాయి.

    అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీద అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక మొదటి పార్ట్ ఎంతటి విజయన్నైతే సాధించిందో, రెండో పార్ట్ అంతకుమించి విజయాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో వీళ్ళు భారీ సక్సెస్ ను కొట్టడానికి భారీ ప్రణాళికల్ని అయితే రూపొందించుకుంటున్నారు…

    ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అవ్వగా, అవి రెండు కూడా మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ఇక అందులో ‘మార్ ముంత చోడ్ చింత’ అనే సాంగ్ ఇప్పటికి కూడా యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ మూవీ మీద ప్రేక్షకులు మంచి అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాతో మరోసారి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక రామ్ ను మరోసారి మాస్ హీరోగా నిలబెట్టే సినిమా కూడా ఇదే అవుతుందని ఆయన చాలా మంచి కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు…

    ఇక ఈ రెండింటితో పాటుగా ప్రభాస్ చేయబోయే ‘సలార్ 2’ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక సలార్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకోబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసిన మేకర్స్ ఈ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందనే విషయం మీద మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు.

    మరి ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాని వచ్చే సంవత్సరం సెట్స్ మీదకి తీసుకెళ్లే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి సిక్వేల్స్ గా వస్తున్న ఈ అన్ని సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అనే దాని మీదనే ఇప్పుడు ప్రతి హీరో అభిమాని కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాలన్నీ కూడా మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి. కాబట్టి అన్నింటికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…