Homeఎంటర్టైన్మెంట్Shraddha Das: ఓహో గులాబి బాల.. "శ్రద్ధ"గా రేపావు గుండెల్లో జ్వాల

Shraddha Das: ఓహో గులాబి బాల.. “శ్రద్ధ”గా రేపావు గుండెల్లో జ్వాల

Shraddha Das
Shraddha Das

Shraddha Das: అప్పుడెప్పుడో 14 సంవత్సరాల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 సినిమాలో శ్రద్ధాదాస్ టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత చిన్నాచితకా సినిమాలు చేసింది. ఏవీ పెద్దగా బ్రేక్ ఇవ్వలేదు. కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్…ఇలా రకరకాల వుడ్ లలో తిరిగినప్పటికీ.. రకరకాల వేషాలు వేసినప్పటికీ పెద్దగా ఫాయిదా దక్కలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్ కు తిరుగు టపా లో వచ్చేసింది.. వచ్చినంత ఈజీగా ఆమెకు అవకాశాలు దొరకలేదు.. అందంగా ఉంటుంది, అంతకుమించి ఫిజిక్ ఉంటుంది.. సామాజిక మద్యమాల్లో హాట్ నెస్ ను పెంచేసింది. అది కూడా టన్నుల్లో.

ప్రియమణితో కాంట్రాక్టు ముగియడంతో ఈటీవీ మల్లెమాల శ్రద్ధ దాస్ ను పిలిచింది. ఢీ షో ప్రస్తుత సీజన్ కు గెస్ట్ ను చేసేసింది. చేతుల పెద్దగా సినిమాలు లేకపోవడంతో శ్రద్ధదాస్ మరింత శ్రద్ధగా ఢీ షో మీద మనసు లగ్నం చేసింది. తన ఒంటిలోని హాట్ నెస్ ను ప్రతి ఎపిసోడ్ కు కొత్తగా ప్రజెంట్ చేస్తోంది. దీనికి మల్లెమాలవారి నుంచి కూడా పూర్తి సహకారం లభించడంతో రెచ్చిపోతున్నది. శేఖర్ మాస్టర్ తో రొమాంటిక్ పాటలకు స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను రెచ్చగొడుతుంది. టీం లీడర్ ఆదిని ఓ ఆట ఆడుకుంటున్నది. ఇది ఢీ స్క్రిప్ట్ లో భాగమే అయినప్పటికీ.. శ్రద్ధాదాస్ మరింత లీనమవుతోంది. మొన్న ఉప్పెన సినిమాలో జలజల జలపాతం అనే సాంగ్ కు శేఖర్ మాస్టర్ తో శ్రద్ధ వేసిన స్టెప్పులు మామూలుగా లేవు.. ఆ పాట లైవ్ లో చూస్తున్న ఆదినే తట్టుకోలేక గిల్ల గిల్ల కొట్టుకున్నాడు. ఇక ఆడియన్స్ పరిస్థితి ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు.

Shraddha Das
Shraddha Das

కేవలం మల్లెమాలనే నమ్ముకుంటే పని కాదు అనుకుందేమో.. ఇటీవల రోజుకో తీరుగా శ్రద్ధదాస్ ఫోటోషూట్ నిర్వహిస్తోంది. తన దేహంలో ఉన్న హాట్ నెస్ ను సరికొత్తగా ప్రజెంట్ చేస్తోంది..క్లీవేజ్ షో తో అభిమానుల గుండెల్లో వేడి పుట్టిస్తోంది.. ఇంత చేసినా తెలుగు దర్శకనిర్మాతలు పాపం ఈ అమ్మడికి అవకాశాలు ఇవ్వడం లేదు..జర కొంచెం ఓపిక తీసుకుని ఆమె అందచందాన్ని చూసి అవకాశాలు ఇవ్వండయ్యా! అన్నట్టు ప్రస్తుతం శ్రద్ధదాస్ చేతిలో ఢీ షో తప్ప మరేమీ లేవు.. ఇలాగే అవకాశాలు లేకుండా పోతే ఫేడ్ అవుట్ అవుతానని అనుకుందో ఏమో…రోజుకో గ్లామర్ షో తో అభిమానులను కనువిందు చేస్తోంది శ్రద్ధాదాస్.! పాపం అవకాశాల కోసం ఎన్ని కష్టాలు పడుతుందో?!

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular