Cows Helped Police: ఒక కరుడు గట్టిన నేరస్థుడిని ఆవులు పట్టించాయి. నేరగాడిని ఆవులు పట్టించడం ఏంటి అనుకుంటున్నారా.? మీరు చదివింది నిజమే. నిజంగానే గోవులు ఒక నేరస్థుడిని పోలీసులు పట్టుకునేలా చేశాయి.. అసలు ఏం జరిగింది..? ఆవులు ఎలా పట్టించాయో మీరు చదివేయండి.
ఆవులు పోలీసులకు సహాయం చేశాయి. నేరుగా నిందితుడు ఉన్న చోటుకు పోలీసులను తీసుకెళ్లాయి. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆవులను పొగుడుతూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ పెట్టారు. కొన్నాళ్ల కిందట ఒక వ్యక్తి హత్య కేసులో చిలుక సాక్ష్యం చెప్పిన సంఘటన గురించి చాలామంది వినే ఉంటారు. యజమాని హత్యకు సంబంధించి ఓ చిలుకను కోర్టులో ప్రవేశపెట్టారు. మాటలు వచ్చిన ఆ చిలుక యజమానిని ఎవరు చంపారో చెప్పింది. దీంతో, కోర్టు నేరస్తుడిని కనిపెట్టేసింది. ఆ చిలుకకు మాటలు వచ్చు కాబట్టి అది ఓ మనిషిలా సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు మనం చదవబోతున్న స్టోరీలో ఆవులు ఓ నేరగాడిని పట్టించాయి. సదరు నేరస్థుడు ఉన్న చోటును తెలుసుకునేలా పోలీసులకు సహాయం చేశాయి. దీంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
పోలీసులు వెతుకుతున్న వ్యక్తిని పట్టించిన ఆవులు..
కొద్దిరోజుల క్రితం అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన జోషువా రసల్ మిల్టన్ అనే వ్యక్తి హైవేపై ఉన్నాడు. ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి. అతడు వాటిని పట్టించుకోకుండా వేగంగా వెళ్ళిపోయాడు. ఇది గుర్తించిన పోలీసులు అతని వెంట పడ్డారు. హైవే పోలీసులు వాహనానికి, అతడు వాహనానికి చేజింగ్ జరిగింది. జోషువా ఒకచోట రోడ్డు పక్కన తన కారును ఆపి పొలాల్లోకి వెళ్లిపోయాడు. పొలాల్లో దాక్కుని ఉండిపోయాడు. పోలీసులు అతని వాహనం ఆగిన చోటులో పొలాల్లో గాలించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ అతడు పోలీసులు కంట పడకపోవడంతో పోలీసులకు అతన్ని పట్టుకోవడం కష్టం అయింది.
పోలీసులకు సహాయం చేసిన ఆవులు..
పోలీసులు కొద్ది నిమిషాల తరబడి అక్కడ చేస్తున్న వ్యవహారాన్ని అక్కడే గడ్డి మేస్తున్న ఆవులు దృష్టిలో పడింది. వెంటనే ఆవులు పోలీసులకు సహాయం చేశాయి. జోషువా దాక్కున్న స్థలానికి పోలీసులను తీసుకెళ్లాయి. పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రాఫిక్ పోలీసులు చెప్పుకొచ్చారు. తమకు సహాయం చేసిన ఆవుల ఫోటోలు తీసి తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ మొత్తం సంఘటన గురించి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆసక్తికరంగా కనిపిస్తున్న ఈ పోస్టును వేలాదిమంది వీక్షిస్తున్నారు. సాధారణంగా ఈ తరహా పనులను కుక్కలు ఎక్కువగా చేస్తుంటాయి. కానీ విచిత్రంగా ఎక్కడ ఆవులు ఒక నేరస్థుడిని పట్టించడం విచిత్రంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇది గొప్ప విషయమని పలువురు కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు.
Web Title: Cows help police find suspect north carolina
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com