Different Marriage In Bihar: అరవై ఏళ్ల తరువాత గోడ పట్టుకుని నాకు నడకొచ్చింది అన్నాట్ట. ప్రేమిస్తే వయసులోనే పెళ్లి చేసుకోవాలి. అంతేకాని పదేళ్ల తరువాత నా మనసు మారింది. నీతో పెళ్లికి నేను రెడీ అంటూ ఓ జంట చేసిన వైనాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ప్రేమకు వయసుతో సంబంధం లేకపోయినా వేరే పెళ్లిళ్లు చేసుకుని జీవితభాగస్వామితో సంసారం చేసుకుంటున్న సమయంలో మళ్లీ తమ ప్రేమకు రెక్కలొచ్చాయని చెప్పి తిరిగి పెళ్లి చేసుకోవడమే విచిత్రం. వింటే అందరు ఆశ్చర్యపోవాల్సిందే.

బిహార్ లోని ఖగారియా గ్రామానికి చెందిన సోనీదేవి, సుమిత్ వయసులో ప్రేమించుకుననారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనసు మార్చుకుని పెద్దలు కుదిర్చిన వారితోనే వివాహం చేసుకున్నారు. ఎవరి జీవితాలు వారికి ఉన్నాయి. ఎవరి భాగస్వామితో వారు హాయిగా సంసారం చేసుకుంటున్నారు. కానీ ఇటీవల వారికి ఏమైందో ఏమో కానీ వీరి ప్రేమ హద్దులు దాటింది.
Also Read: Bigg Boss Telugu OTT: చివరి కెప్టెన్ అతడే.. బిగ్ బాస్ ఓటీటీని ముగించేస్తున్నారా?
సోనీదేవి తన ఇంట్లోని డబ్బు, నగలు తీసుకుని ప్రియుడిని రావాలని కబురు పంపింది. దీంతో ఇద్దరు కలిసి గుళ్లో పెళ్లి చేసుకున్నారు. దీనికి ఆ ఊరి పెద్దలు అడ్డుచెప్పారు. పెళ్లయిన తరువాత పిల్లలు పుట్టిన ఇన్నాళ్లకు వివాహమేమిటని ప్రశ్నించారు. తమకు ప్రేమ కావాలని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటామని చెప్పారు.దీంతో పిల్లల బాధ్యతలు ఎవరు చూస్తారని అడిగితే సమాధానం చెప్పలేదు.

దీంతో వారు పోలీసులను సైతం ఆశ్రయించారు. తమ ప్రేమను విడదీయవద్దని ప్రాధేయపడటం ఆశ్చర్యకరమే. కట్టుబాట్ల పేరుతో మమ్మల్ని విడదీస్తే తమకు బతుకు అక్కర్లేదని చెప్పడం విశేషం. ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని సోనిదేవి, సుమిత్ చెప్పడంతో అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో అంటూ పాటలు పాడుకున్నారు.
ప్రేమ ఎంత మధురం… అన్నారో సినీకవి. దాన్ని నిజం చేశారు. ప్రేమలో వారికి ఏం కనిపించిందో ఏమో కానీ కన్నవారిని వదిలి ఈ వయసులో వివాహం చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే. వీరి ప్రేమ పాడుగాను ఇంత ముదురు వయసులో పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తానికి అనుకున్నది సాధించారు. ప్రేమకు హద్దులు లేవని చాటారు.
Also Read:Prabhas In KGF 3: KGF 3 లో ప్రభాస్.. ఫాన్స్ కి పండగే
