YCP: వైసీపీలో నెంబర్ టూ కోసం పోటీ జరుగుతోంది. ఇన్నాళ్లు జగన్ తరువాత స్థానం సజ్జల రామకృష్ణారెడ్డిదే అన్నా ప్రస్తుతం విజయసాయిరెడ్డికి కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఎవరు నెంబర్ టూ అనే దానిపై చర్చ సాగుతోంది. గతంలో వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా విజయసాయిరెడ్డి జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉండేవారు కాల క్రమంలో ఆయన ఉత్తరాంధ్ర కు పరిమితమయ్యారు. సజ్జల ఆయన స్థానాన్ని ఆక్రమించారు. దీంతో ఇప్పుడు నెంబర్ టూ పై పెద్ద దుమారమే రేగుతోంది.
జగన్ ను కలవాలంటే నెంబర్ టూ నే కలుసుకుని తరువాత అధినేతను కలిసే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఇప్పుడు సజ్జలను కలవాలా? లేక విజయసాయితో చర్చించాలా అనే ఆలోచన అందరిలో వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా సరైన స్పష్టత లేకపోవడంతో అందరు ఎవరిని కలవాలనే ఆలోచనలో పడిపోతున్నారు. సజ్జలనా విజయసాయిరెడ్డా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరికి సమ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఎవరు నెంబర్ టూ అనే విషయంపై ఎప్పటికి తేలేనో అని చూస్తున్నారు.
పార్టీ పెట్టకముందు నుంచి విజయసాయిరెడ్డి జగన్ కు నమ్మకస్తుడిగా ఉండేవారు. తరువాత పార్టీలో చేరికలన్ని ఆయన నేతృత్వంలోనే జరిగేవి. అధికారంలోకి వచ్చాక కూడా విజయసాయిరెడ్డిదే ఆధిపత్యం కొనసాగేది తరువాత ఆయన జాతీయ రాజకీయాలు చూసుకున్నారు. దీంతో విజయసాయిరెడ్డి ప్రాతినిథ్యం తగ్గిందని తెలుస్తోంది. దీంతో ఆయన ఢిల్లీకి పరిమితమయ్యారు. ఇక్కడ సజ్జల హవా పెరిగింది.
ప్రస్తుతం విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడంపై చర్చ సాగుతోంది. విజయసాయికి మునుపటి వైభవం మళ్లీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజుల క్రితమే అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించడంతో ప్రస్తుతం విజయసాయినే నెంబర్ టూ అనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఎవరి స్థానం ఏమిటనే దాని గురించే ప్రధానంగాచర్చ సాగుతోంది.
ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో నెంబర్ టూ స్థానంపై ఎవరి అంచనాలు వారికున్నాయి. కానీ అధినేత జగన్ ఎవరికి నెంబర్ టూ పొజిషన్ ఇస్తారో అర్థం కావడం లేదు. దీనిపై పార్టీలో కూడా జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. సజ్జలనా లేక విజయసాయి నా అనే ప్రశ్నలు అందరి మదిలో తొలుస్తున్నాయి.