Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ సగం పూర్తయ్యి ఇక ముగింపు దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే సగం రోజులు పూర్తయిన ఈ షోలోకి తాజాగా డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ ఎంట్రీతో మలుపుతిరిగింది. అతడి కామెడీ టైమింగ్.. బిగ్ బాస్ లో అతడి జోష్ కు జనాలు బాగా ఆకర్షితులవుతున్నారు. భారీ స్పందనతో దూసుకెళుతున్న ఈ షోలో తాజాగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో చివరి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. దీనిలో ఎవరు గెలిచారు? ఎందుకు ఇప్పుడే చివరి కెప్టెన్సీని పరిమితం చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ హిట్ అవుతుందో లేదోనన్న భయాల నడుమ నిర్వాహకులు ఎన్నడూ చూడని బోల్డ్ కంటెంట్ ను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఇది చివరి దశకు చేరుకోవడంతో మరింత కొత్త కాన్సెప్టులు తీసుకువస్తున్నారు.ఇది మరింతగా మజాను పంచుతోంది.
Also Read: NTR Warning To Koratala Siva: కొరటాల శివ కి ఎన్టీఆర్ వార్నింగ్..
బిగ్ బాస్ ఈ వారం నటరాజ్ మాస్టర్ కు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అతడికి మొబైల్ ఇచ్చి అందులో ఇంటిసభ్యులను చంపాలని (గేమ్ పరంగా) ఓ టాస్క్ ఇచ్చాడు. నటరాజ్ బుట్టలో పడ్డవారు కిల్ అయిపోయినట్టే లెక్క. అలా యాంకర్ శివ, అనిల్ రాథోడ్, అఖిల్, హమీదాలు కిల్ అవుతారు. ఇక బిందుమాధవి, బాబా భాస్కర్, మిత్రాశర్మ, ఆషురెడ్డి లను మాత్రం నటరాజ్ కిల్ చేయలేకపోతాడు. దీంతో వీరు కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నిలుస్తారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ షాకిచ్చాడు. ఈ బిగ్ బాస్ చివరి కెప్టెన్సీ టాస్క్ ఇదేనంటూ షాకిస్తాడు. ఇటుకల టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పరీక్ష పెడుతాడు. ఇందులో బిందుమాధవి, ఆషురెడ్డి ఓడిపోతారు. నటరాజ్ పలు సార్లు ప్రయత్నించి ఓడిపోతాడు. చివరకు బాబా భాస్కర్ విజయం సాధించి బిగ్ బాస్ ఇంటికి చివరి కెప్టెన్ అవుతాడు.
ఇలా కెప్టెన్సీ టాస్క్ లో అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక చతికిలిపడ్డ నటరాజ్ మాస్టర్ బాధ వర్ణనాతీతంగా మారింది. ఎందుకంటే కెప్టెన్సీ పోటీదారులను నామినేట్ అయ్యేలా చేసిందే నటరాజ్. అతడే గెలవకపోయేసరికి ఆ ఏడుపుతో బిగ్ బాస్ హౌస్ అంతా ఏరులైపారింది.చివరి కెప్టెన్ అవుదామనుకున్న నటరాజ్ ఆశలు నెరవేరలేదు.

ఇక హౌస్ లో చివరి కెప్టెన్సీ అని బిగ్ బాస్ కూడా షాకిచ్చాడు. దీంతో ఈ షోను త్వరలోనే ముగించబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. అయితే విజేతను నిర్ణయించే చివరి వారాల్లో కెప్టెన్సీ వల్ల ఒకరు సేఫ్ అవుతారని.. అలా కాకూడదనే అందరినీ నామినేషన్ లోకి తీసుకొచ్చి ఎవరి సత్తా ఏమిటో ప్రేక్షకులే డిసైడ్ చేసేలా ఇలా కెప్టెన్ ఎన్నికను ముగించారని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ ఓటీటీ ఆదరణ దక్కుతున్నా ఇంత త్వరగా ఎందుకు ముగిస్తున్నారన్న వార్తలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.
Also Read:Prabhas In KGF 3: KGF 3 లో ప్రభాస్.. ఫాన్స్ కి పండగే
Recommended Videos:


