Homeఎంటర్టైన్మెంట్Corona Positive For Balakrishna: స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

Corona Positive For Balakrishna: స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

Corona Positive For Balakrishna: నటసింహం బాలయ్యను కూడా కరోనా వదల్లేదు. ఆయనకు అంటించేసింది. మొదటి వేవ్, రెండో వేవ్ లో బాలయ్య కరోనా బారినపడినట్టు కనిపించలేదు. ఒకవేళ పడ్డా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే బయటపడినట్టున్నారు. కానీ అందరికీ తగ్గుముఖం పడ్డాక బాలయ్యకు ఈ కరోనా అంటడం కలకలం రేపుతోంది.

Corona Positive For Balakrishna
Balakrishna

నిజానికి వర్షకాలం రావడంతోనే దేశంలో కరోనా తీవ్రత బాగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా రోజు వారీ కేసుల సంఖ్య 17వేలకు చేరింది. ఇక తెలంగాణలోని హైదరాబాద్ లోనూ కేసులు భారీగానే ఉన్నాయని.. కానీ టెస్టులు చేయకపోవడంతో బయటపడడం లేదని టాక్.

Also Read: Pawan Kalyan Remuneration: రోజుకు రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్… ఇది పవన్ రేంజ్ అంటే!

ఇక షూటింగ్ లు, రాజకీయాలు, బసవతారకం ఆస్పత్రికంటూ బిజీగా గడిపే స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా కరోనా బారినపడ్డాడు. హైదరాబాద్ లోని కరోనా తీవ్రతకు బాలయ్య బాబు కూడా ఆ జబ్బు బారినపడ్డాడు.

Corona Positive For Balakrishna
Balakrishna

బాలయ్యకు కరోనా సోకినా ఆయనకు ఎలాంటి లక్షణాలు బయటపడలేదని సమాచారం. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నాడు. ఇప్పుడు కరోనా బారినపడడంతో అభిమానులు, సినీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. లక్షణాలు లేవని అంటున్నారు.

Also Read:Ari Movie : అన‌సూయతో ‘పేపర్ బాయ్’ దర్శకుడి `అరి`
Recommended Videos
పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరో తెలుసా || Actress Pavitra Lokesh First Husband ||  Suchendra Prasad
Sonu Sood Latest Gym Work Out Visuals || Sonu Sood Latest Video || Oktelugu Entertainment
గీతాంజలి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో  చూడండి || See How Geetanjali Movie Heroine is Now

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version