https://oktelugu.com/

చిరంజీవి కరోనా అప్ డేట్.. ఏమైందంటే?

అతిరథ మహారథులెందరికో కరోనా అంటుకుంది. కొంతమందిని తమతో తీసుకెళ్లింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకి చనిపోవడంతో ఇక సినీ ప్రముఖులంతా అలెర్ట్ అయ్యారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సైతం కరోనా పాజిటివ్ గా రావడంతో ఆయన అభిమానులు కంగారుపడ్డారు. Also Read: ప్రభాస్ కి అక్కగా ఆల్ టైమ్ హోమ్లీ బ్యూటీ ! తాజాగా చిరంజీవి అభిమానులకు శుభవార్త అందింది. చిరంజీవి కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో చిరంజీవికి కరోనా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 10:40 PM IST
    Follow us on

    అతిరథ మహారథులెందరికో కరోనా అంటుకుంది. కొంతమందిని తమతో తీసుకెళ్లింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకి చనిపోవడంతో ఇక సినీ ప్రముఖులంతా అలెర్ట్ అయ్యారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సైతం కరోనా పాజిటివ్ గా రావడంతో ఆయన అభిమానులు కంగారుపడ్డారు.

    Also Read: ప్రభాస్ కి అక్కగా ఆల్ టైమ్ హోమ్లీ బ్యూటీ !

    తాజాగా చిరంజీవి అభిమానులకు శుభవార్త అందింది. చిరంజీవి కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో చిరంజీవికి కరోనా నెగెటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు.

    నాలుగు రోజుల క్రితం చిరంజీవికి కరోనా వచ్చినట్లు తేలింది. అయితే ఎలాంటి లక్షణాలు చిరులో కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి వైద్యులను సంప్రదించారు.

    తాజాగా చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో చిరంజీవికి కరోనా లేదని తేలింది. ఈ క్రమంలోనే తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించి తన క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ చిరంజీవి కృతజ్క్షతలు తెలిపారు.

    Also Read: ఓ రేంజ్ కి వెళ్లలేకపోయినా.. ఛాన్స్ లు బాగానే పడుతుంది !

    ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ ఫ్యూజ్ చేసి నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. అపోలో వైద్యులను సంప్రదించాను. సిటీ స్కాన్ చేసి ఛాతీలో ఎలాంటి కరోనా జాడలు లేవన్నారు. తర్వాత మూడు రకాల కిట్లతో పరీక్షలు చేశారు. చివరకు పాజిటివ్ వచ్చిన చోట కూడా నెగెటివ్ వచ్చింది. మొదట పరీక్ష చేసిన కిట్ లో లోపం వల్లే తనకు కరోనా వచ్చిందని తప్పిదం జరిగిందని వైద్యులు తెలిపారు. ఈ సమయంలో మీరందరూ చూపించిన ప్రేమానుభావాలకు కృతజ్క్షతలు’ అని చిరంజీవి పేర్కొన్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    https://twitter.com/KChiruTweets/status/1326903825454796803?s=20