https://oktelugu.com/

టీమిండియా జెర్సీ మారిందోచ్.. ఏ రంగునో తెలుసా?

టీం ఇండియాకు కొత్త జెర్సీ రాబోతోంది. ఈ ఆస్ట్రేలియా పర్యటనలో ఆ కొత్త జెర్సీని టీమిండియా ఆటగాళ్లు ధరించబోతున్నారు. ఈ మేరకు ఆటగాళ్లు ధరించిన కొత్త జెర్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. Also Read: రోహిత్ కం బ్యాక్.. విమర్శలతో ఇండియన్ టీంలోకి తీసుకున్న బీసీసీఐ టీమిండియా ఈసారి స్కై బ్లూ జెర్సీలను కాకుండా రంగు మార్చినట్టు తెలిసింది. నీలం రంగు నుంచి నేవీ బ్లూకు మారుతుందని తెలిసింది. 1992 […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 09:43 PM IST
    Follow us on

    టీం ఇండియాకు కొత్త జెర్సీ రాబోతోంది. ఈ ఆస్ట్రేలియా పర్యటనలో ఆ కొత్త జెర్సీని టీమిండియా ఆటగాళ్లు ధరించబోతున్నారు. ఈ మేరకు ఆటగాళ్లు ధరించిన కొత్త జెర్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి.

    Also Read: రోహిత్ కం బ్యాక్.. విమర్శలతో ఇండియన్ టీంలోకి తీసుకున్న బీసీసీఐ

    టీమిండియా ఈసారి స్కై బ్లూ జెర్సీలను కాకుండా రంగు మార్చినట్టు తెలిసింది. నీలం రంగు నుంచి నేవీ బ్లూకు మారుతుందని తెలిసింది.

    1992 ప్రపంచకప్ లో భారత జట్టు ధరించిన రెట్రో జెర్సీల్లా ప్రస్తుతం టీమిండియా జెర్సీ మార్చినట్టు తెలిసింది. ఆస్ట్రేలియాతో త్వరలో ఆరంభమయ్యే టీ20, వన్డే సిరీసుల్లో కోహ్లీ సేన సరికొత్త జెర్సీలు ధరించనుందని సమాచారం.

    Also Read: సన్ రైజర్స్ ఔట్: ఫస్ట్‌ టైమ్‌ ఫైనల్‌ చేరిన ఢిల్లీ కేపిటల్స్‌

    ఇప్పుడున్న నీలం రంగులో కాకుండా నేవీ బ్లూ రంగులోకి మారనున్నట్టు తెలిసింది. కోవిడ్ 19 నేపథ్యంలోనే ఎక్కువ రక్షణ అందించే కిట్లు అందిస్తున్నామని బీసీసీఐ తెలిపింది. అయితే జెర్సీల మార్పుపై బీసీసీఐ అధికారికంగా వివరణ ఇవ్వలేదు.

    టీమిండియా క్రికెటర్ల కొత్త జెర్సీలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇదిప్పుడు వైరల్ గా మారింది.

    https://twitter.com/imVkohli/status/1326564190711148549?s=20