Corona Positive For Hero: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించకముందే వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ మళ్ళీ ఆందోళన బాట పట్టారు.

షూటింగ్ స్పాట్స్ లో కరోనా కలకలం సృష్టిస్తే.. ఒక్కసారిగా ఆ స్పాట్ లో ఉన్న వంద మందికి పైగా కరోనా సోకే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు అందరి టెన్షన్. పోనీ షూటింగ్ కి బ్రేక్ ఇద్దామంటే.. ఇప్పటికే మొదలైన సినిమాలకు అతి గతి లేకుండా పోతుంది. అయితే తాజాగా మరో ప్రముఖ యంగ్ హీరోకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
Also Read: ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్న కింగ్ నాగార్జున… బంగార్రాజు టీజర్ ఎప్పుడంటే ?
నటుడు విశ్వక్ సేన్ కరోనా వ్యాధికి గురై.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా విశ్వక్‌సేన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా కరోనా అని తేలింది కూడా షూటింగ్ స్పాట్ లోనే. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి చెందిన యూనిట్ సభ్యులు ఐసోలేషన్ కి వెళ్లక తప్పలేదు. పైగా ఆ యూనిట్ లో అందరూ సీనియర్ నటీనటులే ఉన్నారు.
ఇక తనకు కరోనా వచ్చిన సంగతి విశ్వక్ సేన్ పోస్ట్ చేస్తూ.. ‘నాకు కరోనా పాజిటివ్. డాక్టర్లు ఇచ్చిన సూచనలు పాటిస్తున్నా. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా పాజిటివ్ రావడం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్కులు ధరించి.. మీ కుటుంబ సభ్యులనూ జాగ్రత్తగా చూసుకోండి’’ అని విశ్వక్ మెసేజ్ చేశాడు. కరోనా మిగిలిన సినిమాల పై కూడా పెద్ద ఎఫెక్ట్ పడేలా ఉంది.