Homeఎంటర్టైన్మెంట్Singer Sunitha: అప్పటి నుంచి ఏడవడం మానేశానంటున్న సింగర్ సునీత... కారణం అదేనా

Singer Sunitha: అప్పటి నుంచి ఏడవడం మానేశానంటున్న సింగర్ సునీత… కారణం అదేనా

Singer Sunitha: తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. మధురమైన గాత్రానికి సింగర్‌ సునీత ప్రతిరూపంలా అనిపిస్తోంది. టాలీవుడ్ లో ఆమెను ఇష్టపడనివారు లేరు అంటే అతిశయోక్తి కాదు అనాలి. ఇక ఇటీవలే సునీత రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారి మీడియా లో హాట్ టాపిక్ గా నడిచింది. ఇక తాజాగా ఆమె కొత్త సంవత్సరం సందర్భంగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

singer sunitha sensational comments about her personal life

ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… ఈ ఏడాది ఎన్నో సంఘటనలు చూసాను కానీ నాకేమి అనిపించలేదు. ఎందుకంటే బాల సుబ్రహ్మణ్యం గారు మృతి చెందినప్పుడే నా కన్నీళ్లు ఆగిపోయాయి. ఆ తరువాత కన్నీళ్లు తెప్పించే ఏ విషయమైనా కన్నీళ్లు మాత్రం రావడం లేదు. ఏదైనా సంఘటన విన్న వెంటనే కొద్దిసేపు బ్లాంక్ అయిపోతాను అని అన్నారు.

అంతేకాని ఏడుపు రావడం లేదని, బాలు గారి మరణాన్ని ఇప్పటికి తట్టుకోలేక పోతున్నానని ఎమోషనల్ అయ్యారు. ఇక తన వైవాహిక బంధం బాగుందని, తన భర్త బిజినెస్ విషయంలో తలదూర్చనని… ఏదైనా సలహా అడిగితే  చెప్తాను అని తెలిపారు సునీత. ప్రస్తుతం కొన్ని సినిమాలలో మంచి పాటలను పాడుతున్నాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular