Corona India: చైనా, అమెరికా, జపాన్, బ్రెజిల్, కొరియా దేశాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను కొత్త వేరియంట్ల గుర్తింపు కోసం పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని ఆదేశించింది.. ఇప్పటికే ఆయా దేశాల్లో రోజుకు 35 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే ప్రస్తుతం చైనాలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది.. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. వందల్లో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇటీవల జీరో పాలసీని ఎత్తేసింది.. ఫలితంగా కేసులు మరింత ఉధృతం అవుతున్నాయి.. పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.

కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయా
కోవిడ్ అనేది వైరస్ సంబంధిత వ్యాధి కావడంతో దీని వ్యాప్తి అధికంగా ఉంటుంది.. పైగా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త కొత్త లక్షణాలను కలుగజేస్తూ ఉంటుంది.. కోవిడ్ లోనూ రకరకాల వేరియంట్లు మానవాళిని ఉక్కిరి బిక్కిరి చేశాయి.. ముఖ్యంగా 2021లో ప్రబలిన కోవిడ్ 19 వేరియంట్ ప్రజలకు చుక్కలు చూపించింది. కేవలం ఈ వేరియంట్ 60 లక్షల మందిని బలితీసుకుంది… అనధికారిక లెక్కల ప్రకారం ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.. ఇప్పటికీ ఈ వైరస్ బారిన పడిన వారు రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. ముఖ్యంగా డయాబెటిక్ ఉన్నవారు అయితే నరకం చూస్తున్నారు.. అయితే తాజాగా చైనా దేశంలో వ్యాప్తి చెందుతున్న కోవిడ్ లో ఎటువంటి కొత్త వేరియంట్ ఆనవాళ్లు కనిపించలేదని తెలుస్తోంది.. అయితే అక్కడ మరణాలు నమోదు అవుతుండడం వైద్యులను నివ్వెర పరుస్తోంది.

సన్నద్ధం కావాల్సిందే
పొరుగు దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మరొకసారి సన్నద్ధం కావలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలు వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేయాల్సిందే.. ఎందుకంటే గత రెండు దశల్లో జనాభా అధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ మరణాలు నమోదు అయ్యాయి.. పైగా కోవిడ్ తీవ్ర స్థాయిలో ప్రబలితే వైద్య సదుపాయాలు అందరికీ అందించడం కష్టమవుతుంది కనుక… ఇప్పటి నుంచే జాగ్రత్త చర్యలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చు.. అయితే చైనా దేశంలో అక్కడ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.. మరోవైపు చైనా తర్వాత అధిక జనాభా ఉన్న మన దేశంలో జీరో పాలసీ అమలు చేయడం కష్టం. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా చాలా విపత్కర పరిస్థితులను దేశం ఎదుర్కొంటున్నది. ఇలాంటి సమయంలో మరొకసారి లాక్ డౌన్ అంటే అది దేశ ఆర్థిక ప్రగతి పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ నష్టాన్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని ఆదేశించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కాగా కోవిడ్ మొదటి, రెండు దశల్లో నేర్చుకున్న పాఠం వల్ల దేశంలో వైద్య ఆరోగ్యశాఖ చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేసింది.. సదుపాయాలను పెంచింది.. వైద్య ఆరోగ్య రంగంపై చేస్తున్న వ్యయాన్ని కూడా పెంచింది.. ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ… ప్రజలు కూడా తమ బాధ్యతగా మసలుకుంటే మంచిది.