Pawan Kalyan vs Ambati Rambabu: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు స్ట్రయిట్ గా మాట్లాడడం లేదు. చిన్నపిల్లాడు చాక్లెట్ తగదా మాదిరిగా పవన్ చుట్టూనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. అసలు విషయాన్ని వదిలేసి.. దానిని డైవర్ట్ చేసే పనిలో పడ్డారు. తన బిడ్డ చనిపోతే వచ్చిన పరిహారంలో మంత్రి అంబటి వాటా అడిగారని ఆ బాధిత తల్లిదండ్రులే ఆరోపిస్తున్నారు. వారు లేవనెత్తిన అంశం అబద్ధమైతే ఖండించాలి. అనుమానాలుంటే నివృత్తి చేయాలి. సంబంధం లేకుంటే అదంతా అభూతకల్పనేని తేల్చాలి. కానీ అంబటి రాంబాబు మాత్రం తనకు అలవాటైన రాజకీయ దాడినే నమ్ముకున్నారు. పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో పలానా కామెంట్స్ చేశారని.. రైతులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం ముందుందని అసందర్భ మాటలు ఆడుతున్నారు. ముందు పవన్ గురించి పక్కన పెట్టి బాధిత కుటుంబం చేసిన ఆరోపణ గురించి అంబటి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ అవేవీ మాట్లాడకుండానే హడావుడిగా ప్రెస్ మీట్ ముగించి వెళ్లిపోయారు. అసలు విషయం గురించి వదిలేశారు.

అయితే ఈ విషయంలో బాధిత తల్లిదండ్రుల ఆరోపణలను తిప్పికొట్టే చాన్స్ అంబటి వద్ద ఉంది. ఆయన ఈ స్టేట్ మినిస్టర్. ఏం జరిగిందో క్షణాల్లో వివరాలు తెప్పించుకోగలరు. వారి బిడ్డ నిజంగా చనిపోయాడా? పరిహారానికి దరఖాస్తు చేసుకున్నారా? సీఎం సహాయ నిధి నుంచి పరిహారం మంజూరైందా? ఎంత మంజూరైంది? ఆ చెక్కు బాధిత కుటుంబానికి చేరిందా? లేదా? అన్నది తెలుసుకోవడం క్షణాల్లో పని. రికార్డులతో సహా బయటకు వెల్లడించే ఉంది. ఒక వేళ చెక్కు అందకపోతే.. అందుకు కారణాలు కూడా చెప్పాల్పిన బాధ్యత అంబటి రాంబాబుపై ఉంది. కానీ ఇవేవీ చేయలేదు. రాగాలు తీశారు.. రంకెలు వేశారు. గతంలో మాదిరిగా పవన్ పై విరుచుకుడిప చటుక్కున మాయమైపోయారు.
చెక్కు వచ్చిన మాట వాస్తవం. కానీ అది బాధితులకు చేరలేదు. ఇంకా మధ్యలోనే ఉంది. అంటే రూ.2.50 లక్షల కోసం బేరం ఆడింది వాస్తవమేనని తేలుతోంది. అయినా అటువంటిదేమీ జరగలేదన్నట్టు అంబటి వ్యవహరించారు. అటు మీడియాలో, నెట్టింట తనపై ఇంతలా ప్రచారమవుతున్నా అందుకు తగ్గట్టు అంబటి రియాక్టు కాకపోవడం ఏమిటన్నది ప్రశ్న.. అంతకు మించి అనుమానం. ఆరోపణల్లో నిజముండబట్టే ఆయన వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారన్న టాక్ నడుస్తోంది. అసలు అంబటి ప్రెస్ మీట్ లో నే విషయం లేదు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని అంబటి వీరవిహారం చేస్తారని అంతా భావించారు. కానీ అసలు మ్యాటర్ ను వదిలేశారు. పవన్ కళ్యాణ్, రైతులు అంటూ పొడిపొడిగా మాట్లాడి వదిలేశారు.

అయితే పవన్ సత్తెనపల్లి వచ్చి అంబటికి భలే ఝలక్ ఇచ్చారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అవినీతికి పాల్పడుతున్నారంటూ పవన్ కామెంట్స్ చేశారు. బహుశా పవన్ స్ఫూర్తితోనే బాదిత కుటుంబం మీడియా ముందుకు వచ్చినట్టుంది. అంబటి శవాలపై పేలాలు ఏరుకునే తీరు బయటపడింది. ఈ ఇష్యూలో అంబటి రాంబాబు తప్పు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా దీనిపై స్పందించడం లేదు సరికదా.. ఒకవిధంగా సమర్థించుకుంటున్నట్టుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేల్కొనకుంటే ఉన్న కొద్దిపాటి పరువు కూడా పోయే ప్రమాదం ఉంది.