Rajamouli- Ram Gopal Varma: ఒకరు ఎదుగుతుంటే సమాజం సహించలేదు. అది మానవ నైజం. ముఖ్యంగా మన పక్కనోడు మనల్ని దాటేసి ఎక్కడికో వెళ్ళిపోతే నచ్చదు. దర్శకుడు రాజమౌళి సక్సెస్ ని చూసి తట్టుకోలేని ఫిల్మ్ మేకర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ అనే తేడా లేకుండా ప్రతి పరిశ్రమలో ‘ఆయన గొప్పేంటంటా’ అని పెదవి విరిచే దర్శకుడు, నిర్మాతలు లేకపోలేదు. టాలీవుడ్ లో కూడా బాధపడే వారు కచ్చితంగా ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి గ్లోబల్ ఫేమ్ అనుభవిస్తున్నారు.

గాడ్స్ ఆఫ్ సినిమాగా చెప్పుకునే జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ సైతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను మెచ్చుకున్నారు. అంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది చెప్పండి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ షాకింగ్ ట్వీట్ వేశారు. ఆయనకు ప్రాణహాని ఉందన్నట్లు వెల్లడించారు. ”హే రాజమౌళి సర్… మీ సెక్యూరిటీని పెంచుకోండి. ఎందుకంటే మీ సక్సెస్ చూసి తట్టుకోలేని కొందరు డైరెక్టర్స్ ఒక గ్యాంగ్ గా ఏర్పడి చంపాలనుకుంటున్నారు. వాళ్లలో నేను కూడా ఒకడిని. నాలుగు పెగ్గులు మండేయడంలో నేను ఈ సీక్రెట్ బయటపెట్టేశాను” అని ట్వీట్ చేశారు.
వర్మ ఈ ట్వీట్ సరదాగా చేశారు. అయితే రాజమౌళి సక్సెస్ చాలా మంది దర్శకుల గుండెల్లో మంటకు కారణమైందన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు. మరి కొన్ని ట్వీట్స్ లో రాజమోళిని వర్మ ఆకాశానికి ఎత్తారు. మొగల్ ఏ అజమ్ మూవీ దర్శకుడు కె అసిఫ్, షోలే దర్శకుడు రమేష్ సిప్పీలను కూడా నువ్వు దాటేశావు. నీ కాలివేళ్ళను ముద్దాడాలని ఉంది. దాదాసాహెబ్ పాల్కే నుండి ఇప్పటి వరకు ఎవరూ కామెరూన్ తో ఓ ఇండియన్ డైరెక్టర్ మాట్లాడే రోజు వస్తుందని ఊహించి ఉండరు అంటూ… వరుస ట్వీట్స్ వేశారు.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. సాయంత్రం అయితే వోడ్కా కిక్ లోకి వెళ్లే వర్మ ఫోన్ తీసుకొని మనసులోకి వచ్చిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తాడు. మరోవైపు జనవరి 24న ఆస్కార్ నామినేషన్స్ ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ కి చోటు దక్కుతుందా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నడూ లేని విధంగా ఇండియన్స్ నామినేషన్స్ లిస్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. వరల్డ్ వైడ్ విపరీతమైన ప్రచారం దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్ కచ్చితంగా నామినేషన్స్ లో ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
And sir @ssrajamouli , please increase ur security because there is a bunch of film makers in india who out of pure jealousy formed an assassination squad to kill you , of which I am also a part ..Am just spilling out the secret because I am 4 drinks down
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2023