Geetu Royal- Aadi Reddy: బిగ్ బాస్ సీజన్ 6లో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్స్ కొందరు మాత్రమే. వారిలో గీతూ రాయల్ ఒకరు. చిత్తూరు చిరుతగా ఫేమస్ అయిన గీతూ తన మార్క్ గేమ్, యాటిట్యూడ్, మాటలతో ఆకట్టుకున్నారు. అయితే అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. కాగా గీతూ కారణంగా ఆదిరెడ్డి దంపతుల మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయనే వాదన ఉంది. ఆదిరెడ్డితో గీతూ సన్నిహితంగా ఉండటం భార్య కవితకు ఇష్టం లేదని, ఆమె ఆగ్రహంగా ఉన్నారన్న కథనాలు వెలువడ్డాయి.

ఆదిరెడ్డి హౌస్లో ఉన్నప్పుడు కవిత ఫోన్ చేశారు. ఆదిరెడ్డితో మాట్లాడుతూ గీతూతో అంత సన్నిహితంగా ఉండొద్దన్నట్లు హితబోధ చేసింది. గీతూ మీద ఒకింత వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పుకార్లలో నిజం ఉండొచ్చనే వాదన బలపడింది. అయితే ఈ విషయంపై గీతూ తాజా ఇంటర్వ్యూ లో స్పందించారు. తన కారణంగా ఆదిరెడ్డి-కవితల మధ్య మనస్పర్థలు వచ్చాయనడంలో నిజం లేదన్నారు. కాకపోతే ఆదిరెడ్డి అసలు అమ్మాయిలతో మాట్లాడేవాడు కాదట. నాకు మాత్రం చాలా దగ్గరయ్యాడు. అది కవితకు కొత్తగా తోచిందని గీతూ అన్నారు.
పల్లెటూరి అమ్మాయి అయిన కవిత మొదట్లో కొంత జలస్ ఫీలైన మాట వాస్తవమే. తర్వాత మెల్లగా ఆమె అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె నాతో చాలా బాగా మాట్లాడుతుంది. మేము ముగ్గురం కలిసి బయటకు వెళ్ళాం. కలిసి వీడియోలు చేశాము… అంటూ గీతూ చెప్పుకొచ్చింది. అలా ప్రచారం అవుతున్న పుకార్లకు చెక్ పెట్టింది. గీతూ ఎలిమినేట్ అయ్యే వరకూ ఆదికి ఆమెనే ప్రపంచం. వారిద్దరూ ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు. గీతక్కా అని ఆదిరెడ్డి ఆమెను పిలిచేవాడు.

ఓ వారం డేంజర్ జోన్లో కి వచ్చిన ఆదిరెడ్డిని పట్టుకొని గీతూ బాగా ఏడ్చేసింది. అయితే ఆదిరెడ్డి ఎలిమినేట్ కాలేదు. ఊహించని విధంగా గీతూ 9వ వారం ఎలిమినేట్ అయ్యింది. చిన్న పిల్ల మాదిరి ఏడ్చిన గీతూ నేను వెళ్ళను సార్ అని మొండికేయడం విశేషం. ఎలిమినేటైన గీతూ ఇంటికి వెళ్లకుండా రెండు రోజులు క్వారంటైన్ చేసిన రూమ్ కి వెళ్లి తన ఎలిమినేషన్ వీడియో పదే పదే చూశారట. అప్పుడు అన్నం, నీళ్లు కూడా ముట్టలేదట. పేరెంట్స్ వచ్చి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారట.