Jabardasth Comedian Rithu Chowdary: జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి హఠాన్మరణం పొందారు. ఆయన చావుకు కారణం గుండెపోటు అని తెలుస్తుంది. జనవరి 22 ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. తండ్రితో దిగిన ఫోటో షేర్ చేస్తూ రీతూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మీతో దిగే చివరి ఫోటో ఇదే అవుతుందని ఊహించలేదు నాన్న. ప్లీజ్ తిరిగి రండి నాన్నా అంటూ… మనసులు కలచివేసేలా వేదన చెందుతున్నారు. చెస్ట్ పెయిన్ తో కుప్పకూలిపోయిన రీతూ తండ్రిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారట. అయితే అప్పటికే ఆయన గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారట.

రీతూ చౌదరి తండ్రి మరణం గురించి తెలిసిన సన్నిహితులు, పరిశ్రమ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. రీతూ చౌదరి కుటుంబానికి తమ సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా గత ఏడాది రీతూ చౌదరి వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీకాంత్ అనే ఓ వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయట చక్కర్లు కొట్టాయి. అతన్ని రీతూ చౌదరి వివాహం చేసుకుంటున్నారన్న ప్రచారం జరిగింది.
అతడు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి. వ్యాపారస్తుడు కూడా అంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే రీతూ చౌదరి పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక సీరియల్ యాక్ట్రెస్ గా రీతూ కెరీర్ మొదలుపెట్టారు. జబర్దస్త్ షోతో ఆమె పాపులారిటీ తెచ్చుకున్నారు. లేడీ కమెడియన్ గా ఫేమస్ అయ్యారు. పలువురి టీమ్స్ లో స్కిట్స్ చేశారు. ఇటీవల యాంకర్ విష్ణుప్రియతో పాటు థాయిలాండ్ టూర్ కి వెళ్లారు.

థాయిలాండ్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో రీతూ చౌదరి చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన పర్సనల్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. రీతూ తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేస్తారు. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆమె పాపులారిటీ రాబట్టారు.
View this post on Instagram