December 31 Alert: డిసెంబర్‌ 31లోపు ఈ మూడు పనులు పూర్తి చేయండి.. లేకపోతే ఇబ్బందే!

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారు ఈనెల 31లోపు డీమ్యాట్‌ ఖాతా, ట్రేడింగ్‌ ఖాతాలకు నామినీని అప్‌డేట్‌ చేయాలి. లేదంటే జనవని 1 నుంచి డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలు ఫ్రీజ్‌ అవుతాయి.

Written By: NARESH, Updated On : December 12, 2023 6:40 pm

December 31 Alert

Follow us on

December 31 Alert: మరో 18 రోజుల్లో 2023వ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోతుంది. చాలా మంది కొత్త సంవత్సరం వస్తోంది.. దాన్ని ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలని ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారు. ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. డిసెంబర్‌ 31 ఆదివారం వస్తుంది. సెలవు రోజు కావడంతో సెలబ్రేషన్స్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. ఈ ఏడాది ముగిసేలోపు చేయాల్సి మూడు ముఖ్యమైన పనులు ఉన్నాయి. అవి చేయకుంటే.. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికే చేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ చేయనివారు తప్పక చేసుకోవాలి. మరి ఆ మూడు పనులు ఏంటో తెలుసుకుందాం.

డీమ్యాట్, ట్రేడింగ్‌ అకౌంట్‌ అప్‌డేట్‌ చేయాలి..
స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారు ఈనెల 31లోపు డీమ్యాట్‌ ఖాతా, ట్రేడింగ్‌ ఖాతాలకు నామినీని అప్‌డేట్‌ చేయాలి. లేదంటే జనవని 1 నుంచి డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలు ఫ్రీజ్‌ అవుతాయి. అదే జరిగితే షేర్లు కొనలేం.. అమ్మలేం. అందుకే షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారు ఈ పని త్వరగా చేసుకోవాలి.

లాకర్‌ అగ్రిమెంట్‌ రెన్యూవల్‌..
ఇక బ్యాంకులో ప్రస్తుతం అందరికీ ఖాతాలు ఉన్నాయి. అయితే బ్యాంకుల్లో లాకర్లు మాత్రం కొందరికే ఉంటాయి. ఈ లాకర్ల అగ్రిమెంట్‌ ఈ డిసెంబర్‌ 31తో ముగియనుంది. అందుకే లాకర్‌ ఉన్నవాళ్లు ఈనెలాఖరులోపు రివైజ్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. అలా చేయని పక్షంలో జనవరి 1 నుంచి లాకర్‌ సేవలు నిలిచిపోతాయి.

ఆధార్‌ అప్‌డేట్‌..
ఇక మరో ముఖ్యమైన విషయం ఆధార్‌ అప్‌డేట్‌. ఈనెల 14 తేదీ వరకు మాత్రమే ఆధార్‌ అప్‌డేట్‌కు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అవకాశం కల్పించింది. అప్పటిలోగా ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవాలి. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. 14 డిసెంబర్‌ తర్వాత ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోలేరు. తర్వాత కేంద్రం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.