Homeట్రెండింగ్ న్యూస్Farmer Kiss On Modi: మోదీ ఫొటోకు ముద్దు.. మమకారాన్ని ఆ రైతు ఆపుకోలేకపోయాడు!

Farmer Kiss On Modi: మోదీ ఫొటోకు ముద్దు.. మమకారాన్ని ఆ రైతు ఆపుకోలేకపోయాడు!

Farmer Kiss On Modi
Farmer Kiss On Modi

Farmer Kiss On Modi: దేశంలో ఎన్నికలు ఏవైనా కేంద్రంలో ఉన్న బీజేపీ.. ఫుల్‌ మెజార్టీతో దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ఎన్నికల్లో చాలా స్థానాల్లో, రాష్ట్రాలలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక, తాజాగా కర్నాటకలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటకలో ప్రచారంలో బీజేపీ జోరుపెంచింది. ఈ క్రమంలో అక్కడ ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ రైతు మోదీ ఫొటోను ముందులతో ముంచెత్తాడు.

మమకారాన్ని ఆపుకోలేక..
కర్నాటకలో ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్నాటకలో ఓ బస్సుపై మోదీ ఫొటో కనిపించడంతో ఓ రైతు.. ప్రధానిపై తనకున్న మమకారాన్ని చూపించుకున్నాడు. ఓ రైతు.. బస్సుపై ఉన్న ప్రధాని మోదీ ఫొటోకు ముద్దుపెట్టుకున్నాడు. మోదీ ఫొటోను చూస్తూ కాసేపు కబుర్లు కూడా చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Farmer Kiss On Modi
Farmer Kiss On Modi

బస్సులపై జీ20 సమ్మిట్‌ ఫొటోలు
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల కేఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సులపై జీ20 సమ్మిట్‌కు సంబంధించిన ప్రకటన పోస్టర్లను అంటించింది. అందులో ప్రధాని మోదీ ఫొటోను పెద్దగా ముద్రించి ఉంది. అటుగా వెళ్తున్న ఓ రైతు.. బస్సు వద్దకు వచ్చి పోస్టర్‌ను చూసి మురిసిపోయాడు. ఈ క్రమంలో మోదీ ఫొటోకు ముద్దుపెట్టాడు. ఈ సందర్భంగా సదరు రైతు మాట్లాడుతూ.. ‘‘నాకు వెయ్యి రూపాయలు వచ్చేవి.. ఇప్పుడు నాకు రూ. 500 ఎక్కువ వచ్చేలా చేశావు. మా ఆరోగ్య సంరక్షణ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు. ప్రపంచాన్నే జయిస్తావు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోను కేంద్రమంత్రి పీయూస్‌ గోయల్‌ ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version