Homeలైఫ్ స్టైల్Dates : ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ఆ 8 లాభాలేంటో తెలుసా?

Dates : ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ఆ 8 లాభాలేంటో తెలుసా?

Dates : మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే మనం బతకగలం. వాటిని సక్రమంగా పనిచేసేలా చేసే ఆహారాలు తీసుకుంటేనే మనకు ప్రయోజనం. చలికాలంలో అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. దీంతో వాటి నుంచి తట్టుకునేందుకు మనం సరైన ఆహారాలు తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కాల్షియం పొటాషియం ఫాస్పరస్, మెగ్నిషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే వాటిని మనం తీసుకుంటే మంచిది. ఈ కాలంలో ఖర్జూరాలు మనకు ఎంతో తోడ్పడతాయి. శక్తినిచ్చే ఆహారాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఎముకల దృఢత్వానికి..

ఎముకలు దృఢంగా కావడానికి ఇవి సాయపడతాయి. చలికాలంలో ఎండ తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. సూర్యరశ్మి తక్కువగా ఉన్నందున ఎముకలు బలంగా ఉండవు. కాబట్టి ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఎముకల్లో పుష్టి పెరుగుతుంది. తద్వారా మన ఎముకల బలానికి ఢోకా లేకుండా ఉంటుంది. ఇందులో పొటాషియం, ఫాస్పరస్, కాపర్, మెగ్నిషియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కీళ్లనొప్పులు

చాలా మంది వయోభారం వల్ల ఏర్పడే సమస్య కీళ్ల నొప్పులు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు ఖర్జూరాలు బాగా ఉపకరిస్తాయి. ఎముకల్లో ఉండే గుజ్జు తగ్గిపోతేనే ఈ నొప్పులు బాధిస్తాయి. ఖర్జూరాలు తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుంచి రక్షణ కల్పిస్తాయి. చలికాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో గుండె పోటు వచ్చే అవకాశాలుంటాయి. ఖర్జూరాలు తింటే చెడు కొవ్వును దూరం చేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఉదయం, సాయంత్రం వీటిని స్నాక్స్ గా తింటే నీరసం పోయి శక్తి వస్తుంది.

అలసటను..

చలికాలంలో సాధారణంగా అలసటగా ఉంటుంది. శరీరంలో తక్షణ శక్తి కోసం ఖర్జూరాలను తింటే మంచిది. మహిళలకు రక్తహీనత సమస్య ఉంటుంది. దీంతో వారి గోళ్లు పాలిపోయినట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, చర్మం పాలిపోవడం, గర్భస్రావమయ్యే అవకాశం రక్తహీనత వల్ల వస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడంలో కూడా ఇవి తోడ్పడతాయి. వీటికి పరిష్కార మార్గం ఖర్జూరాలను తినడమే. రెగ్యులర్ గా మనం ఖర్జూరాలు తింటే మనకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

జీర్ణ సమస్యలు

చలికాలంలో మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావు. అందుకే పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఖర్జూరాలు తినడం వల్ల మన జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇవి పెద్దపేగు క్యాన్సర్ ను తగ్గిస్తాయి. ఈ కాలంలో చర్మం పొడిబారిపోతుంది. ఖర్జూరాలు తింటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని పాలిపోకుండా చేస్తాయి. ఈ నేపథ్యంలో వీటిని తరచుగా తినడం వల్ల మన దేహం ఎంతో బాగా ఉంటుంది. దీనికి మనం చేయాల్సిందల్లా వాటిని ఆహారంగా చేసుకోవడమే. ఇందులో ఇన్ని పోషకాలు ఉన్నాయని తెలిసిన తరువాత కూడా తినకపోతే మనకే నష్టం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version