Cock Fight : కోళ్ళకూ పంచాంగ శాస్త్రం ఉంది.. దాన్ని ఔపోసాన పడితేనే పందెం సొంతమవుతుంది

సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేవి కోడిపందాలు.. తెలంగాణ ప్రాంతంలో తక్కువ అయినప్పటికీ… ఆంధ్ర ప్రాంతంలో వీటిని ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు.. కోట్లల్లో పందాలు కాస్తూ ఉంటారు.. ఇక ఈ సంక్రాంతి నాలుగు రోజులయితే అక్కడ సందడి తారస్థాయిలో ఉంటుంది.. మనం సినిమాలో చూపించినట్టు కోడిపందాలు ఉండవు.. కోడిపందాలు అంటే రెండు కోళ్లు పోట్లాడుకోవడమే… కానీ ఆ పోట్లాట వెనుక పెద్ద తతంగం ఉంటుంది.. ఆ తతంగం వెనుక ఏకంగా ఒక శాస్త్ర గ్రంథమే ఉంది. కుక్కుట శాస్త్రం […]

Written By: Bhaskar, Updated On : January 15, 2023 8:54 am
Follow us on

సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేవి కోడిపందాలు.. తెలంగాణ ప్రాంతంలో తక్కువ అయినప్పటికీ… ఆంధ్ర ప్రాంతంలో వీటిని ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు.. కోట్లల్లో పందాలు కాస్తూ ఉంటారు.. ఇక ఈ సంక్రాంతి నాలుగు రోజులయితే అక్కడ సందడి తారస్థాయిలో ఉంటుంది.. మనం సినిమాలో చూపించినట్టు కోడిపందాలు ఉండవు.. కోడిపందాలు అంటే రెండు కోళ్లు పోట్లాడుకోవడమే… కానీ ఆ పోట్లాట వెనుక పెద్ద తతంగం ఉంటుంది.. ఆ తతంగం వెనుక ఏకంగా ఒక శాస్త్ర గ్రంథమే ఉంది.

కుక్కుట శాస్త్రం

కుక్కుట శాస్త్రం..ఇందులో కుక్కుట అంటే సంస్కృతంలో కోడి అని అర్థం. కోడి గురించి వివరించేశాస్త్రం కాబట్టి దానికి కుక్కుట శాస్త్రం అని పేరు పెట్టారు. దీన్ని ఎవరు రాశారో తెలియదు కానీ కోడిపందాల్లో పందాలు కాసే వారికి ఇది ఒక ఆయుధం లాంటిది. యుద్ధానికి భగవద్గీత లాగా… కోడిపందాలకు ఈ కుక్కుట శాస్త్రం అని చెప్పుకోవచ్చు. కుక్కుట శాస్త్రంలో కోడిపందాలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారం ఉంది.. కోడిపుంజులు, వాటి పెంపకం, రంగులు, వర్గీకరణ, ఏ సమయంలో పందెం కాయాలి, కోడి జాతకం, కోడిపుంజు జన్మనక్షత్రం లాంటి ఎన్నో విషయాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. కుక్కుట శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి.. 27 నక్షత్రాలు వివిధ రకాల కోడిపుంజులపై వివిధ రకాల లో ప్రభావం చూపుతాయి. అశ్వని నక్షత్రంలో పుట్టిన నెమలి డేగ కోడి కాకి కోడి మీద గెలుస్తుంది. గౌడు పింగళి మీదా విజయం సాధిస్తుంది.. భరణి నక్షత్రంలో పుట్టిన సవనల నెమలి ఇటుక ఎరుపు కోడి మీద, పిచ్చుక రంగు గౌడ నెమలి మీద, ఎర్ర పొడ ఎర్రటి కాకి మీద గెలుస్తుంది.. కృత్తిక నక్షత్రంలో పుట్టిన ఎర్ర కాక మీద పిచ్చుక రంగు గౌడు నెమలి, ఎర్ర పొడ కోడి గెలుస్తుంది.. రోహిణి నక్షత్రంలో పుట్టిన నెమలి నల్ల మైల కోడి పింగళి ఎర్రకోడి, కాకి ఎర్ర గౌడు కోడి మీద గెలుస్తుంది.. మృగశిరలో పుట్టిన కాకి డేగ.. డేగ పసుపు కాకి, పింగళి కాకి, ఇటుక రంగు డేగ ముంగిస మీద విజయం సాధిస్తుంది.. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన డేగ కాకి మీద… కాకి పింగళి, నల్లమైనా, డేగ పసమి, కాకి కోడి, వెన్నె పోడ పొడి, నల్లపొడ కోడి, ఎర్ర పొడ కోడి, పిచ్చుక రంగు గౌడు కోళ్ళు గెలుస్తాయి. పునర్వాస నక్షత్రంలో పుట్టిన కాకి కోడి మీద, సుద్ధ కాకి కోడి మీద నెమలి డేగ, పిచ్చుక రంగు గౌడు నల్ల బోర, ఎర్రకోడి పుష్యకాకి కోడి మీద, పసమీ కాకి, నల్ల కాకి మీద, పింగళి డేగ, నెమలి మీద, కోడి నెమలి మీద, కాకి పింగళి మీద గెలుస్తుంది.. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన నెమలి డేగ.. పింగళి తుమ్మెద రంగు కాకి , పసుపు రంగు కాగిడేగ, కాకి పిచ్చుక రంగు కోడి, ఎర్రకోడి నల్ల బోర మీద గెలుస్తుంది. మాఘంలో పుట్టిన డేగ నెమలి, కోడి పింగళి… పసుపు రంగు కాగిడేగ మీద , ఎరుపు నెమలి నలుపు డేగ మీద, కోడి గోధుమ రంగు బేగం మీద గెలుస్తాయి.. పూర్వ ఫాల్గుణి, పుబ్బ నక్షత్రంలో పుట్టిన కాకి నెమలి, డేగ మీద… నెమలి
పింగళి గెలుస్తుంది.. ఉత్తర ఫాల్గుణి లో పుట్టిన కోడి నెమలి, కాకి కోడి, డేగ, పింగళి… గోధుమ రంగు డేగ, నలుపు రంగు డేగ మీద గెలుస్తాయి.

ఏ దిశలో అంటే..

నక్షత్రాలే కాదు… దిశ కూడా కోడిపందాల్లో గెలుపోటములను నిర్దేశిస్తుంది.. ఆదివారం, శుక్రవారం నిర్వహించే కోడిపందాలు ఉత్తర దిశలో సాగాలి. సోమవారం, శనివారం దక్షిణ దిశలో సాగాలి.. మంగళవారం తూర్పు దిశలో సాగాలి.. బుధవారం, గురువారం పడమర దిశలో సాగాలి. బిర్రులు కూడా ఎర్రమట్టితో తయారు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గులకరాళ్ళను వాడకూడదు. కోడిపందాలు నిర్వహించే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మద్యం కాకూడదు.. దేహాన్ని కచ్చితంగా శుభ్రపరుచుకోవాలి.. కోళ్లను పోట్లాడుకునే సమయంలో ఉసి గొల్పకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే కుక్కుట శాస్త్రంలో కోళ్లకు సంబంధించిన విలువైన సమాచారం బోలెడు ఉంది. ఇది నిజమా అబద్దమా అని పక్కన పడేస్తే.. కోడిపందాలు నిర్వహించేవారు దీన్ని ఫాలో అవుతూ ఉంటారు.. ఫాలో కాకుండా పందాలు నిర్వహించే వారు కూడా ఉన్నారు.. ఎవరి నమ్మకం వారిది.