Chiranjeevi : తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు..ఒక్కో హీరో ఒక్కో దాంట్లో నిష్ణాతులు..కానీ కామెడీ , డ్యాన్స్ , ఫైట్స్ , యాక్షన్ , సెంటిమెంట్ ఇలా ఒక్కటా రెండా వెండితెర మీద పలికే ఎన్ని నవరసాలను అయినా అలవోకగా పండించగల టాలెంట్ ఉన్న ఏకైక నటుడు ఒక్క మెగాస్టార్ చిరంజీవి మాత్రమే..తెలుగు సినిమా ఇండస్ట్రీ ని రెండు భాగాలుగా విభజించాల్సి వస్తే , చిరంజీవి కి ముందు చిరంజీవికి తర్వాత అని విభజించవచ్చు.

ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత కమర్షియల్ సినిమా ఫార్మటు పూర్తిగా మారిపోయింది..డ్యాన్స్ అంటే ఇలానే చెయ్యాలి..ఫైట్స్ అంటే ఇలాగే ఉండాలి అని ఆడియన్స్ చేత అనిపించుకున్న హీరో ఆయన..నేటి తరం యువ హీరోలు వేస్తున్న స్టెప్పులు మెగాస్టార్ మనం పుట్టకముందే వేసాడు..ఆరోజుల్లో ఆయన వేసిన స్టెప్పులు చూస్తే అసలు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోక తప్పదు..అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు.
మెగాస్టార్ డ్యాన్స్ ని చూసి ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరూ కూడా ఆయనలాగా డ్యాన్స్ వెయ్యడానికి ప్రయత్నం చేసారు..డ్యాన్స్ అయితే వేసేవాళ్ళు కానీ, ఆయన గ్రేస్ ని మ్యాచ్ చేసే హీరో ఇప్పటి వరకు పుట్టలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఆరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి స్టెప్పులతో అదరగొట్టేవాడో, 68 ఏళ్ళ వయస్సులో కూడా అదే రేంజ్ స్టెప్పులతో అభిమానులను అలరిస్తున్నాడు..రీసెంట్ గా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో మెగాస్టార్ వేసిన డ్యాన్స్ ని చూసి అందరికీ మతిపోయింది..ముప్పై ఏళ్ళు దాటితేనే కీళ్ల నొప్పులతో మూలాన కూర్చుంటున్న యూత్ ఉన్న ఈ కాలంలో, 68 ఏళ్ళు వచ్చినా ఉత్సాహం తో డ్యాన్స్ వేసే చిరుని చూసి ఆశ్చర్యపోవడమే మన వంతు అయ్యింది.
అందుకే ఇండస్ట్రీ కి ఎంతమంది హీరోలు పుట్టుకొచ్చిన మెగాస్టార్ ని మ్యాచ్ చేసే హీరో ఇప్పటి వరకు రాలేదు అని అంటుంటారు విశ్లేషకులు..ఇప్పటికీ కూడా ఆయన నేటి తరం స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్స్ , కలెక్షన్స్ పెడుతున్నాడు అంటే అది మామూలు విషయం కాదు..ఆయన వయస్సుకి వచ్చిన హీరోలందరూ ఫేడ్ అవుట్ అయ్యి క్యారక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు..కానీ చిరంజీవి మాత్రం ఇప్పటికి ఇండస్ట్రీ ని ఏలుతునే ఉన్నాడు.