CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) పరపతి గురించి చెప్పనవసరం లేదు. ఆయన ప్రపంచ గుర్తింపు కలిగిన నాయకుడు. అటువంటి నాయకుడు ఏపీకి దొరకడం నిజంగా అదృష్టం. ఈ మాట అంటోంది ఏపీ నాయకులు కాదు. తెలంగాణ నేతలు సైతం ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. రాజకీయంగా విభేదించే వారు సైతం చంద్రబాబుకు జై కొడుతున్నారు. ఇటువంటి తరుణంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తాజాగా ఓ లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో చంద్రబాబుతో బిల్ గేట్స్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి చంద్రబాబును బిల్ గేట్స్ ప్రశంసించారు. ఏపీ సర్కార్, మైక్రోసాఫ్ట్ కంపెనీ వివిధ రంగాల్లో కలిసి పనిచేయడానికి చంద్రబాబు చూపించిన చొరవను బిల్ గేట్స్ అభినందించారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి కనబరచగా.. ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వ్యక్తం అయింది. త్వరలోనే కీలక ఒప్పందాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీకి ప్రయోజనం చేకూరినట్టే.
Also Read: భారత్ ధర్మశాల కాదు.. శరణార్ధులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
* ఇద్దరి మధ్య బంధం
బిల్ గేట్స్ తో( Bill Gates) సీఎం చంద్రబాబుకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. గతంలోనే వారిద్దరి మధ్య ఎన్నో రకాల సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ అధినేతగా చంద్రబాబు ఆయనను కలుసుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. చివరకు సఫలీకృతులు అయ్యారు. అయితే తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ ఏపీ సీఎం చంద్రబాబు కు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కోసం చంద్రబాబు చూపిన చొరవను బిల్ గేట్స్ ప్రశంసించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకోవడానికి గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి చూపింది. ఇప్పటికే బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. వారి మధ్య ఆసక్తి నడిచింది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ నాలెడ్జ్ వినియోగంపై ప్రధానంగా ఆ ఇరువురు చర్చించారు. ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని బిల్ గేట్స్ అభినందనలు కూడా తెలిపారు.
* ఒప్పందంపై అభినందనలు..
అయితే తాజాగా బిల్ గేట్స్ ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ రాసిన లేఖ సోషల్ మీడియాలో( social media) వైరల్ అవుతోంది. ఒక మంచి వాతావరణం లో చంద్రబాబుతో సంప్రదింపులు జరిపినట్లు బిల్ గేట్స్ వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి, పేదల విద్య ఆరోగ్యం పై ఏపీ ప్రభుత్వం తో చేసుకున్న ఒప్పందం పై అభినందనలు తెలిపారు బిల్ గేట్స్. ఇటీవల బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశం అయినా సంగతి తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారం పై కీలక చర్చలు జరిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పనా వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* ప్రభుత్వ సేవల్లో పాలుపంచుకునేందుకు సమ్మతం
ఏపీ ప్రభుత్వం( AP government ) ఆశించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, రియల్ టైం డేటా సిస్టం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ వంటివి చంద్రబాబు నాయకత్వ ప్రతిభను తెలుపుతున్నాయని తాజాగా బిల్ గేట్స్ తన లేఖలో పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి ఏపీకే కాదు.. యావత్ భారతదేశానికి ఉపయోగపడుతుందని కొనియాడారు. త్వరలో తన పర్యటన ఏపీలో ఉండనుందని వెల్లడించారు బిల్ గేట్స్. మొత్తానికి అయితే ఏపీ భవిష్యత్తులో తమ ప్రభావం ఉంటుందని బిల్ గేట్స్ తన లేఖ ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపించగలిగారు.