Jagan : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) రాజకీయాల్లో దిట్ట. ప్రత్యర్థి పార్టీలను ట్రాప్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ పాలనలో సైతం భాగస్వామ్యం అయింది. రాష్ట్ర ప్రభుత్వంలో సైతం బిజెపికి చోటిచ్చింది. అమరావతి రాజధానితో పాటు పోలవరం నిర్మాణం పై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. అటువంటి సమయంలోనే టిడిపిని ట్రాప్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా విషయంలో ఇరుకున పెట్టారు. జగన్ ట్రాప్ తో ఏకంగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. అలా 2019 ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీయగలిగారు. కేంద్రంలో బిజెపి నుంచి పరోక్ష సహాయం అందుకోగలిగారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా టిడిపి కూటమిని ట్రాప్ చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.
Also Read : పరిస్థితి మారుతోంది.. బెంగళూరులో జగన్.. లాయర్లతో భేటీ!
* ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ..
ఈ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్( Super 6 ) పథకాలపై హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. అయితే ఏడాది సమయంలో ప్రధాన సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి కదలిక లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని.. వాటిని గాడిలో పెట్టే పనిలో ఉన్నామని చంద్రబాబు తరచూ చెబుతూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి రాష్ట్ర ఆదాయం పెరిగిందని టిడిపి అనుకూల మీడియాలో భారీ స్థాయిలో కథనాలు వచ్చాయి. అటువంటప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించింది. అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి ఇది మైనస్ అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
* అదేపనిగా విమర్శలు..
సంపద సృష్టించి అయినా ప్రజల కోసం సంక్షేమ పథకాలు( welfare schemes) అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తోంది. సంపద సృష్టి గురించి వ్యాఖ్యానాలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోంది. ప్రజల నుంచి ప్రభుత్వంపై సానుకూలత ఉంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా సంక్షేమ పథకాల కోసం విమర్శలు చేస్తోంది. సంపద సృష్టి ఏది అని ఎగతాళి చేస్తోంది. దీంతో ఇదిగో మా హయాంలో రాబడి పెరిగింది అంటూ టిడిపి అనుకూల మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చేసరికి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ అయ్యింది. అయితే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు ఎందుకని ప్రశ్నించింది. ఈ అంశమే ప్రజల్లోకి తీసుకెళ్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
Also Read : వైసిపి కమ్మ నేతల ఫుల్ సైలెన్స్.. కారణం అదే!
* వ్యతిరేక అంశంగా తీసుకుని..
ప్రజలకు ఉచితాలు అందించడం చంద్రబాబుకు ( CM Chandrababu)ఇష్టం ఉండదు. అభివృద్ధి ఫలాలు అందించడం ద్వారా మాత్రమే ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆయనే ఎక్కువగా భావిస్తారు. అయితే ఈసారి విజయం కోసం సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారు చంద్రబాబు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ గత పది నెలలుగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా రాష్ట్ర రాబడి పెరిగిందని అనుకూల మీడియా చెప్పడం నిజంగా జగన్మోహన్ రెడ్డి నెత్తిపై పాలు పోసినట్టే. ఇది అంశాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా కూటమి జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడకుండా ఉంటేనే మేలు. లేకుంటే మాత్రం గత అనుభవాలు వెంటాడే అవకాశం ఉంది.