Acharya Closing Collections : ఆచార్య క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్ల నష్టమో తెలిస్తే అవాక్కే

Acharya Closing Collections : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన మూవీ ‘ఆచార్య’. ఎన్నో అంచనాలతో విడుదలైంది. అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీకొడుకులు.. మెగా వారసులు నటించినా కూడా ఈ సినిమాకు బోలెడంత హైపస్ వచ్చింది.. అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ మ్యాజిక్ ఇక్కడ పనిచేయలేదు. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమా ప్రేక్షకులను మెప్పించలేదని టాక్ నడిచింది. ఇక ఇది […]

Written By: NARESH, Updated On : May 16, 2022 6:33 pm
Follow us on

Acharya Closing Collections : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన మూవీ ‘ఆచార్య’. ఎన్నో అంచనాలతో విడుదలైంది. అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీకొడుకులు.. మెగా వారసులు నటించినా కూడా ఈ సినిమాకు బోలెడంత హైపస్ వచ్చింది.. అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ మ్యాజిక్ ఇక్కడ పనిచేయలేదు. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమా ప్రేక్షకులను మెప్పించలేదని టాక్ నడిచింది. ఇక ఇది కలెక్షన్లను భారీగా దెబ్బతీసిందనే చెప్పారు.

Acharya

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2వేలకు పైగా స్క్రీన్లలో ఆచార్య విడుదలైంది. 132.50 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలోకి దిగింది. మొదటి రోజే ఈసినిమా కలెక్షన్స్ విషయంలో చేతులెత్తేసింది. రెండోరోజు బాక్స్ ఆఫీస్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత కొత్త సినిమాల రాకతో ఈ మూవీ పుంజుకోలేదు. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నష్టాల పాలైనట్లు సమాచారం. ఇక నిర్మాతలు, చిరంజీవి, దర్శకుడు కొరటాల ఈ మూవీ రెమ్యూనరేషన్ లో కొంత భాగం వెనక్కి ఇచ్చినట్లు ప్రచారం సాగింది.

Also Read: Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే ?

ఆచార్య మూవీ ఇప్పటివరకూ ఎంత కలెక్షన్స్ సాధించిందో లెక్కలు బయటకు వచ్చాయి. చూస్తుంటే ఇది ఆల్ టైమ్ ఎపిక్ డిజాస్టర్ అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆచార్య క్లోజింగ్ కలెక్షన్స్ ఒక్కసారి చూస్తే..

మొదటి రోజు రూ.29.50 కోట్లు కలెక్షన్లు సాధించిన ఆచార్య మూవీ ఆ తర్వాత రెండోరోజు రూ.5.15 కోట్లు వసూలు చేసింది. ఇక ఆ తర్వాత 3వ రోజు 4.07 కోట్లు రాబట్టింది. ఇక కోటి నుంచి కలెక్షన్లు పడిపోయాయి. లక్షల్లోనే 4వ రోజు నుంచి కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఏపీ తెలంగాణ మొత్తం ఈ మూవీ కలెక్షన్లు రూ.40.77 కోట్లుగా నమోదైంది.

ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫీస్ ఇండియాలో ఈ మూవీ 2.80 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో 4.78 కోట్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 48.36 కోట్లు కలెక్షన్లు సాధించింది.

ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్ 131.20 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 132.50 కోట్లు రాబట్టాలి. కానీ ఏకంగా 84.14 కోట్లు నష్టం వాటిల్లింది. ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచింది. సినిమాను మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, రాంచరణ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.

ఆచార్య ఫ్లాప్ కావడంతో దీన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మే 20నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: Telangana Jobs Notification: తెలంగాణలో మోగిన భారీ ఉద్యోగాల మేళా

Recommended Videos:

Tags