Homeఎంటర్టైన్మెంట్Sohail Khan-Seema Khan Divorce: ఆ స్టార్ ఇంట విడాకులు.. కారణం ఆ హీరోయినే...

Sohail Khan-Seema Khan Divorce: ఆ స్టార్ ఇంట విడాకులు.. కారణం ఆ హీరోయినే !

Sohail Khan-Seema Khan Divorce: సోహైల్‌ ఖాన్‌ – సీమా ఖాన్‌ కు విడాకుల వ్యవహారానికి కారణం ఓ హీరోయిన్ అని తాజాగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ ?. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఆ హీరోయిన్ ఎవరో కాదు, బాలీవుడ్ భారీ బ్యూటీ హ్యూమా ఖురేషీ. హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ గత కొన్ని నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని గతంలోనే రూమర్స్ వచ్చాయి. ఐతే, తాజాగా సోహైల్‌ ఖాన్‌ విడాకుల దెబ్బకు ఈ ప్రచారం మరీ ఎక్కువ అయ్యింది.

Sohail Khan-Seema Khan Divorce
Sohail Khan-Seema Khan

హ్యూమా ఖురేషీ విషయంలోనే సీమా ఖాన్‌ కి – సోహైల్‌ ఖాన్‌ కి మధ్య గొడవలు కూడా జరిగాయని టాక్ బాగా వినిపిస్తోంది. మరోపక్క ఈ వార్తల పై హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ సోహైల్‌ నాకు అన్నలాంటి వాడని చెప్పింది. ఇది నిజంగా షాకింగ్ విషయమే. సోహైల్‌ ఖాన్‌ తో ఘాటు రొమాన్స్ చేసింది హ్యూమా ఖురేషీ. మరీ అంతలో అన్న అని పిలవడం ఏమిటో ? ఏది ఏమైనా హీరోయిన్ హ్యూమా ఖురేషీ ఏమి చేసినా విచిత్రమే.

Also Read: Acharya Closing Collections : ఆచార్య క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్ల నష్టమో తెలిస్తే అవాక్కే

సోహైల్‌ ఖాన్‌ – సీమా ఖాన్‌ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. ఈ జంట పెళ్లయిన 24 ఏళ్ల అనంతరం విడిపోవాలని నిర్ణయించుకుంది. వీరు విడాకులు తీసుకుంటున్నారు అనగానే బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. కారణం వీరిది ప్రేమ వివాహం. 1998లో సోహైల్‌ ఖాన్‌- సీమా ఖాన్‌లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. 2000లో ఈ జంటకు నిర్వాన్ ఖాన్‌ పుట్టాడు.

Sohail Khan-Seema Khan Divorce
Sohail Khan-Seema Khan

2011 జూన్ లో సరోగసి ద్వారా రెండో కుమారుడు యోహాన్‌ కు జన్మనిచ్చారు. గత ఏడాది యోహాన్ 10వ పుట్టిన రోజును కూడా చాలా గ్రాండ్ గా చేశారు. మరి అంతలోనే సోహైల్ – సీమా ఎందుకు విడిపోతున్నారు ? వాస్తవానికి 2017లోనే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని వార్తలు హల్‌చల్‌ చేశాయి. సీమా వాటిని ఖండించింది. ఏ బంధం లో అయినా గొడవలు సహజమని, తమకు అన్నింటి కంటే తమ పిల్లల భవిష్యత్తే చాలా ముఖ్యమని ఆమె అప్పుడు పేర్కొంది.

దాంతో.. సోహైల్ – సీమా కలిసే ఉంటారని అందరూ భావించారు. కానీ, సడెన్ గా ఈ జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఈ వార్తతో సల్మాన్ ఖాన్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ వార్తలో హ్యూమా ఖురేషీ దూరడం షాకింగ్ విషయమే.

Also Read:Bigg Boss Telugu OTT- Nataraj Master: బిందు తో పెట్టుకుంటే ఇంతే… బూతుల మాస్టర్ ఎలిమినేట్!

Recommended Videos:

జగనన్న మాట..జనాలు ఇంటి బాట || YS Jagan Public Meeting at Eluru District || Ok Telugu

సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత || Namratha participated in Sarkaruvari Pata Success Celebrations

మళ్లీ గీతగోవిందం కాంబినేషన్.. ఈ సారి ట్రిపుల్ ధమాకా || Vijay Deverakonda ||Director Parasuram

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version