Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu OTT- Nataraj Master: బిందు తో పెట్టుకుంటే ఇంతే... బూతుల మాస్టర్...

Bigg Boss Telugu OTT- Nataraj Master: బిందు తో పెట్టుకుంటే ఇంతే… బూతుల మాస్టర్ ఎలిమినేట్!

Bigg Boss Telugu OTT- Nataraj Master: గత వారం అంతా నామినేషన్స్ లోకి రాగానే పిచ్చిపట్టినట్టు ప్రవర్తించిన నటరాజ్ మాస్టర్ జర్నీ బిగ్ బాస్ లో ముగిసింది. ప్రేక్షకాదరణ అత్యధికంగా ఉన్న బిందుమాధవితో పెట్టుకొని అతడ తన సీటుకే ఎసరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎలిమినేసన్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. గత రెండు మూడు రోజులుగా అసహనంతో ఉన్న మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ అవుతానని ముందుగానే ఊహించినట్లున్నాడు. అందుకే దేవుడిని వేడుతూ.. పిచ్చిగా ప్రవర్తిస్తూ భయపడినట్లుగా ప్రవర్తించాడు.

Bigg Boss Telugu OTT- Nataraj Master:
Nataraj Master

భయపడిందే నిజమైంది. అనుకున్నట్టే నటరాజ్ ఔట్ అయ్యాడు. బిందుతో నామినేషన్స్ సందర్భంగా నోరుజారినందుకు ఆమె లక్షణబాణానికి ఎలిమినేట్ అయిపోయాడు. ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు కాస్కో అంటూ నటరాజ్ నామినేషన్ సందర్భంగా బిందుపై అనుచితంగా మాట్లాడాడు. అలాగే అఖిల్ తో నీకు ఉన్నట్లుగా నాకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లేరు. నా కష్టంతోనే ఇక్కడి వరకూ వచ్చానంటూ రెచ్చిపోయారు.

Also Read: Tamannaah: ఎయిర్ పోర్ట్ లో తమన్నా ధగధగలు.. కొత్త పోజులు కేక ధగధగలు.. కొత్త పోజులు కేక

నామినేట్ కాగానే హౌస్ లోని అనిల్ తో, బాబా భాస్కర్ తో కూడా ఆర్గూమెంట్ పెట్టుకున్నాడు. శివతో కూడా వాదనకు దిగాడు. గత వారం అంతా కూడా హౌస్ లో పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తూ అందరితో గొడవలు పెట్టుకున్నాడు. ఆడియెన్స్ ను ఓటు అప్పీల్ చేయడానికి ఆపసోపాడు పడ్డాడు. బిందుతో ఇతడి ప్రవర్తనే చాలా మైనస్ అయ్యింది. అతడి ఎలిమినేషన్ కు కారణమైంది.

Bigg Boss Telugu OTT- Nataraj Master:
Nataraj Master

టాప్ 5లోకి వెళ్లకపోతే వేస్ట్ అని.. దేవుడా నన్ను తీసుకుపో అంటూ ఎమోషన్ పండించిన నటరాజ్ మాస్టర్ ఆర్తనాదాలు ప్రేక్షకుల చెవికి ఎక్కలేదు. ఎందుకంటే నామినేషన్స్ సందర్భంగా బిందుమాధవిపై నటరాజ్ వ్యక్తిగత దాడి చేశాడు. ఆ పర్సనల్ జీవితంపై నోరుపారేసుకున్నాడు. ఆమె తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అవే కొంప ముంచాయి. ఇతడిపై ప్రేక్షకుల్లో ఏహ్యభావం కలిగించాయి. చివరకు ప్రేక్షకాదరణ మెండుగా ఉన్న బిందుమాధవి నిలిచి హౌస్ లోనే ఉండగా.. ఆమెతో అనవసరంగా పెట్టుకున్న నటరాజ్ మాస్టర్ ఊహించినట్టుగానే ఎలిమినేట్ అయిపోయారు. వ్యక్తిగతంగా కంటెస్టెంట్లపై దూషించడమే నటరాజ్ మాస్టర్ కు ఎసరు తెచ్చింది. అదే ఆయనను బయటకు పంపించింది.

Also Read:Shilpa Shetty: కమ్మని అమ్మతనాన్ని చూపించిన ‘శిల్పా శెట్టి’ !

Recommended Videos:

జగనన్న మాట..జనాలు ఇంటి బాట || YS Jagan Public Meeting at Eluru District || Ok Telugu

సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత || Namratha participated in Sarkaruvari Pata Success Celebrations

మళ్లీ గీతగోవిందం కాంబినేషన్.. ఈ సారి ట్రిపుల్ ధమాకా || Vijay Deverakonda ||Director Parasuram

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version