https://oktelugu.com/

Pasivadi Pranam Child Artist : ‘పసివాడి ప్రాణం’ సినిమాలో చిరంజీవి పక్కన నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

Biography of Serial Artist Sujitha :  చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ఎమోషనల్ చిత్రం ‘పసివాడి ప్రాణం’ సినిమా ప్రేక్షకాదరణ పొంది మంచి ఘనవిజయం సాధించింది. చిరంజీవి కెరీర్ లోనే ఒక సూపర్ హిట్ గా నిలిచింది. బాగా గుర్తిండిపోయే చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.     ఈ సినిమాలో చిరంజీవితోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ బుడ్డోడికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. నిజానికి ఇతడు బుడ్డోడు కాదు.. బుడ్డదే.. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2022 / 11:29 AM IST
    Follow us on

    Biography of Serial Artist Sujitha :  చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ఎమోషనల్ చిత్రం ‘పసివాడి ప్రాణం’ సినిమా ప్రేక్షకాదరణ పొంది మంచి ఘనవిజయం సాధించింది. చిరంజీవి కెరీర్ లోనే ఒక సూపర్ హిట్ గా నిలిచింది. బాగా గుర్తిండిపోయే చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

     

     

    ఈ సినిమాలో చిరంజీవితోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ బుడ్డోడికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. నిజానికి ఇతడు బుడ్డోడు కాదు.. బుడ్డదే.. ఈ చిత్రంలో అబ్బాయి పాత్రలో కనిపించింది అమ్మాయి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ చిన్న పాప పేరు ‘సుజీత’. ఇప్పుడు స్టార్ మాటీవీలో వస్తున్న ‘వదినమ్మ’ సీరియల్ లో మెయిన్ రోల్ పోషిస్తోంది ఈ సుజాతనే.

    ఇక జై చిరంజీవ సినిమాలోనూ హీరో చిరంజీవికి చెల్లెలిగా కూడా నటించింది. ఇక్కడే కాదు.. సుజీత చిన్నప్పుడు ఐదు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. నటనలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవితోపాటు తెలుగులో వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

    -సుజీత బయోగ్రఫీ
    సుజీత 1983 జూలై 12న కేరళలోని తిరువనంతపురంలో టీఎస్ మణి-రాధ దంపతులకు జన్మించింది. సుజీత ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరి కావడం గమనార్హం. ప్రముఖ చిత్ర నిర్మాత ధనుష్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు చెన్నైలో నివసిస్తున్నారు. సుజీతకు ఒక బాబు ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన ఈమె ప్రయాణం.. హీరో అబ్బాస్ సినిమాలో కనిపించినప్పుడు సుజీత వయసు కేవలం 41 రోజులు. తర్వాత కేఆర్ విజయ మనవరాలిగా కనిపించింది. మలయాళ సిరీస్ ‘స్వాంతం మలూట్టీ’ లో మొట్టమొదటి సారిగా ప్రధాన పాత్రలో నటించింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు అడుగులు వేసింది. ‘మారుతని’ సీరియల్ ద్వారా సుజీతకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిసారిగా ‘దియా’, కణం అనే సినిమాల్లో నటించింది.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘పసివాడి ప్రాణం’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను సుజీత పంచుకుంది. ఐదు భాషల్లో ‘పసివాడి ప్రాణం’ సినిమా తీస్తే ఆ ఐదింటిలో తానే నటించినట్లు తెలిపారు. చిరంజీవి పక్కన నటించిన అనుభూతి మాత్రం మరిచిపోలేనిది అని చెప్పుకొచ్చింది.

    ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. వదినమ్మతోపాటు పలు సీరియల్స్ లో అక్కగా, చెల్లిగా నటిస్తూ టీవీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.