https://oktelugu.com/

Roja: రోజాపై అలాంటి పంచ్ లు వేసిన రాకెట్ రాఘవ.. ఎత్తుకు ఎదిగిపోయారంటూ?

Roja: బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ప్రారంభం అయినప్పటి నుంచి ఈ షోకు రోజా జడ్జిగా వ్యవహరిస్తుండగా తాజాగా మంత్రి పదవి దక్కడంతో రోజా ఈ షోకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా రాకెట్ రాఘవ మనోకు సార్ నమస్కారం అండి అని చెబుతూ రోజాకు మాత్రం పైకి చూస్తూ నమస్కారమండి అని చెబుతాడు. కమెడియన్ మేడం గారికి అంతపైకి నమస్కారం పెడుతున్నావ్ అని అడగగా ఇంకా ఎత్తుకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 18, 2022 / 11:30 AM IST
    Follow us on

    Roja: బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ప్రారంభం అయినప్పటి నుంచి ఈ షోకు రోజా జడ్జిగా వ్యవహరిస్తుండగా తాజాగా మంత్రి పదవి దక్కడంతో రోజా ఈ షోకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా రాకెట్ రాఘవ మనోకు సార్ నమస్కారం అండి అని చెబుతూ రోజాకు మాత్రం పైకి చూస్తూ నమస్కారమండి అని చెబుతాడు. కమెడియన్ మేడం గారికి అంతపైకి నమస్కారం పెడుతున్నావ్ అని అడగగా ఇంకా ఎత్తుకు ఎదిగిపోయారురా అని రాఘవ చెప్పారు.

    రాకెట్ రాఘవ అలా కామెంట్ చేయడంతో రోజా చాలా సంతోషించారు. ఆ తర్వాత కమెడియన్ ఆవిడ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారని అన్నారు. రాకెట్ రాఘవ బిస్కెట్ బాగా వేశావురా అని చెప్పగా మొదలెట్టింది ఎవడు అని కమెడియన్ మరో పంచ్ వేశారు. రోజా జబర్దస్త్ షోకు గుడ్ బై చెబుతుండటంతో ఆమె అభిమానులు సైతం ఫీలవుతున్నారు. రోజాగారి నవ్వులను మేం మిస్ అవుతామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    రోజాగారి స్థానాన్ని ఆమని లేదా సుమ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వెంకీ మంకీస్ స్కిట్ లో వెంకీ మన చిన్న తండ్రి ఎక్కడని అడగగా గడ్డం నవీన్ ఎంట్రీ ఇవ్వగా నువ్వొచ్చావేంటి నాన్న అని అడుగుతాడు. నా కన్న తండ్రి చిట్టి తండ్రి అని పిలిచావని గడ్డం నవీన్ చెప్పగా ఇందుకు కాదు నాన్నా నిన్ను ఎవరూ పెట్టుకోనిది అని వెంకీ చెబుతాడు. గడ్డం నవీన్ నువ్వు వెళ్లిపోయినప్పటి నుంచి చూశావా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో అంటూ అదిరే అభి గురించి కామెంట్ చేశారు.

    వెంకీ తాగుబోతు రమేష్ ను స్కూల్ కు ఎందుకు వెళ్లలేదు అని అడగగా కడుపునొప్పి అని చెబుతాడు. కడుపునొప్పి ఎక్కడ అని అడగగా గర్భసంచిలో అని తాగుబోతు రమేష్ సమాధానం ఇస్తాడు. ప్రోమో రిలీజైన కొన్ని గంటల్లోనే జబర్దస్త్ ప్రోమోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అయితే హైపర్ ఆది లేకపోవడం అభిమానులను కొంతమేర నిరాశకు గురి చేస్తుండటం గమనార్హం.