
JanaSena: ప్రజాప్రతినిధి అంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి మాత్రమే. ఆయనే ప్రభుత్వం కాదు.అలాగని ప్రభుత్వం శాశ్వతం కాదు. కానీ ఏపీలో మాత్రం అందుకు అతీతులమని భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు , వైసీపీ ప్రజాప్రతినిధులు. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తుంటారు. అందుకే అంతులేని అహంభావాన్ని చూపిస్తుంటారు. తప్పు అని తెలిసినా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంటారు. గుంటూరు దాసరిపాలెంకు చెందిన పర్లయ్య, గంగమ్మ కుటుంబంతో కూడా ఇలానే వ్యవహరించారు. కుమారుడ్ని కోల్పోయి పుట్టెడు విషాదంలో ఉన్న ఆ దంపతులను మంత్రి అంబటి రాంబాబు ఎంతగానో క్షోభ పెట్టారు.పైగా తన చర్యలను సమర్థించుకున్నారు.
సత్తెనపల్లి నుంచి పొట్ట చేత్తో పట్టుకొని గుంటూరు వచ్చిన ఆ కుటుంబం రోడ్డు పక్కన గుడిసె వేసుకొని నివాసముంటుంది. వారి ఒక్కగానొక్క కుమారుడు గుంటూరులోని వైసీపీ నేతకు చెందిన హెటల్ లో డ్రైనేజీ పనులకు వెళ్లాడు. ఊపిరాడక చనిపోయాడు. అయితే దీనిపై ఎటువంటి గొడవ చేయకుండా ప్రభుత్వం నుంచి పరిహారం ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షల సాయాన్ని మంజూరు చేయించారు. అయితే ఆ ఐదు లక్షల్లో రూ.2.50 లక్షలు తనకు ఇవ్వాల్సిందేనని మంత్రి అంబటి రాంబాబు పట్టుబట్టారు. దీంతో జనసేన నాయకుల సాయంతో తమకు ఎదురైన ఇబ్బందిని పర్లయ్య, గంగమ్మలు బయటపెట్టారు. అయితే ఇలా చేసినందుకు మంత్రి అంబటి రాంబాబు ఆ చెక్కును వెనక్కి పంపి తన రివేంజ్ ను తీర్చుకున్నారు.
కుమారుడ్ని కోల్లోయి దిక్కూ మొక్కూ లేని ఆ కుటుంబాన్ని ఇతోధికంగా సాయం చేయాల్సింది పోయి.. వారికి మంజూరైన ప్రభుత్వ సాయాన్ని మింగేయ్యాలని చూడడం .. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి, ఆకలిని తెలియజేసింది. అయినా బాధ్యతాయూతమైన మంత్రి స్థానంలో ఉండి కూడా పేదల డబ్బులకు కక్కుర్తిపడడం అంబటిని ప్రతిష్ఠను దిగజార్చింది. అయినా ఆయన తన తప్పిదాన్ని సరిదిద్దుకోలేదు. ప్రభుత్వం కూడా సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. మీడియాకు ఎక్కరు కనుక.. వారికి సాయం వద్దన్న రేంజ్ లో ఆ సాయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

అయితే తన నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాన్ని సాయం చేసే అరుదైన అవకాశాన్ని మంత్రి అంబటి కాలదన్నుకున్నాడు. కానీ జనసేన ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. పవన్ కళ్యాణ్ రూ.4 లక్షల సాయాన్ని అందించారు. జనసేన కీలక నాయకుడు నాదేండ్ల మనోహర్ స్వయంగా నగదును అందించారు. ఆ కుటుంబానికి వైసీపీ నేత వల్ల నష్టం జరిగింది. కనీసం ప్రభుత్వం తరుపున ఆలోటును పూడ్చుతారని భావించారు. కానీ అదీ జరగలేదు. ఇప్పుడు జనసేన ఆ బాధ్యతలు తీసుకుంది. సర్వత్రా అభినందనలు అందుకుంటోంది.