China Health Garage: గ్యారేజ్.. ఈ పదం అందరికీ పరిచయం ఉన్నదే.. కార్లు రిపేర్లు చేసే షెడ్డును కార్ల గ్యారేజీ అని, లారీలు రిపేర్ చేస్తే లారీ గ్యారేజ్ అని, బస్సులు రిపేర్ చేస్తే.. బస్ గ్యారేజ్ అని అంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు, వంకర మార్గంలో నడిచే, అక్రమాలకు పాల్పడే మనుషులను రిపేర్ చేసే గ్యారేజ్ కూడా జనతా గ్యారేజ్ పేరుతో సినిమా తీశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చైనాలె వెలసిన గ్యారేజ్ కొత్తగా ఉంది. దానిపేరు హెల్త్ గ్యారేజ్ అంట.. అక్కడ అన్ని రకాల రోగాలకు రిపేర్లు చేస్తున్నారు. అందుకే దానిని గ్యారేజ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
చికిత్స విధానం తెలుసా..
ఈ హెల్త్ గ్యారేజీలో చికిత్స కూడా వెరైటీగా ఉంది. మెకానిక్ గ్యారేజీలో వాహనాలకు రిపేర్ చేసినట్లుగానే.. ఈ గ్యారేజీలో మనుషుల రోగాలకు రిపేర్ చేస్తున్నారు. మెకానిక్ షెడ్డులో ఉన్నట్లుగానే ఇక్కడ సెట్టింగ్, బెండింగ్ తీసే పెద్దపెద్ద పరికరాలు ఉన్నాయి.
మెకానిక్ డాక్టర్లు..
ఇక ఇక్కడ డాక్టర్లు ఎవరంటే.. ఎముకల బెండు తీసేవారు, వంగిపోయిన వెన్నుపూస సరిచేసేవారు, బిగుసుకుపోయిన ఎముకలు సాఫ్ చేసేవారు. ఇక ఈ డాక్టర్ల దగ్గర ఉండే పరికకాలు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ హెల్త్ గ్యారేజీలో డాక్టర్లు ఉపయోగించేవి సుత్తి, రించ్, ఉలి లాంటి పరికరాలే.
ఎముకలకు మరమ్మతు..
చైనా వాడు ఏది చేసినా కొత్తగా, వెరైటీగా ఉంటుంది. హెల్త్ గ్యారేజీ కూడా అలాగే ఉంది. ఇక్కడ ఎముకల చికిత్స మాత్రమే చేస్తున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. అయితే ఆ చికిత్స విధానమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. వెన్నుపూస జాయింట్స్ సరిచేసేందుకు సుత్తి ఉలిని ఉపయోగిస్తున్నారు. నరాలు సాఫ్ చేసేందుకు బాడిషెతో లాంటి పరికరంతో మసాజ్ చేస్తున్నట్లు ఉంది. ఈ చికిత్స కూడా బాగా పనిచేస్తున్నట్లుగానే వీడియోలో ఉంది. ఓ మహిళకు ట్రీట్‌మంట్ చేసి ఆమెను నడిపిస్తున్నట్లుగా వీడియోలో చూపారు. కొత్తగా, వింతగా ఉన్న ఈ హెల్త్ గ్యారేజ్ వీడియో ఇప్పుడు నెట్టిట్లో వైరల్ అవుతోంది.