Star Producer: ఇండస్ట్రీ లో ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి మరీ ఇంత దారుణంగా ఉంది..?

సామజ వరగమన సినిమా చిన్న సినిమాగా వచ్చి 50 కోట్లకు పైన వసూళ్లను కలెక్ట్ చేసింది.ఇక ఈ సినిమాతో ఆయన ఎంత లాభం అయితే పొందాడో దానికి డబుల్ ఈ రెండు సినిమాల ద్వారా నష్టపోయాడు.

Written By: Raj Shekar, Updated On : October 1, 2023 4:37 pm

Star Producer

Follow us on

Star Producer: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా అనేది సక్సెస్ అయితేనే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అనేవాడు తదుపరి సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటాడు. లేకపోతే ఆయన పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. అందుకే ఇండస్ట్రీ బాగుండాలి అంటే ముందు ప్రొడ్యూసర్ బాగుండాలి ఆ విషయాన్ని అర్థం చేసుకొని డైరెక్టర్లు కొన్ని మంచి సినిమాలు తీస్తే బాగుంటుంది.లేకపోతే ప్రొడ్యూసర్లు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అని ఇప్పటికే ట్రేడ్ పండితులు చాలాసార్లు చెబుతూ ఉంటారు.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన చేసిన వరుస సినిమాలు డిజాస్టర్లు గా మారుతుండడంతో ఆయన పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఆయన ఎవరు అంటే అనిల్ సుంకర ఇప్పటికే ఆయన ఈ సంవత్సరంలో ఏజెంట్, భోళా శంకర్ లాంటి రెండు భారీ డిజాస్టర్ లను అందుకున్నాడు. మధ్యలో సామజవరగమన సినిమా తీసి మంచి విజయం సాధించినప్పటికీ ఏజెంట్,భోళా శంకర్ రెండుసినిమాలు మాత్రం భారీ నష్టాలను మిగిల్చాయనే చెప్పాలి.

సామజ వరగమన సినిమా చిన్న సినిమాగా వచ్చి 50 కోట్లకు పైన వసూళ్లను కలెక్ట్ చేసింది.ఇక ఈ సినిమాతో ఆయన ఎంత లాభం అయితే పొందాడో దానికి డబుల్ ఈ రెండు సినిమాల ద్వారా నష్టపోయాడు. ఆయన ఇప్పుడే కాదు ఇంతకుముందు శర్వానంద్ తో తీసిన మహా సముద్రం సినిమా ద్వారా కూడా చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది దాంతో ఇప్పుడు ఆయన చేసే సినిమాల మీద ఒకటికి పది సార్లు డైరెక్టర్లతో చర్చించుకొని ఒక మంచి హిట్ సినిమా తీయాలనే ఉద్దేశ్యం తోనే ఆయన నెక్స్ట్ సినిమాలు తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయనకి ఇప్పుడు అర్జెంటుగా ఒక మంచి హిట్ అయితే పడాలి లేకపోతే ఆయన పరిస్థితి మరి దారుణంగా తయారవుతుంది. అఖిల్ తీసిన ఏజెంట్ సినిమా మాత్రం ఆయనకు భారీగా నష్టాలను మిగిల్చింది.

ఆ సినిమాని ఓటిటి రైట్స్ కోసం ఏ సంస్థ కూడా అడగడం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఎంత భారీ డిజాస్టర్ అయిందో…అందుకే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఆయన మీద కొంతవరకు జాలి చూపిస్తుందనే చెప్పాలి. ఆయన కూడా ఇకమీదట చేసే సినిమాల స్టోరీలను కరెక్ట్ గా ఎంచుకొని చేస్తే బాగుంటుంది. అంతేతప్ప హీరోలు డేట్స్ ఇచ్చారని ఏది పడితే అది తీసి జనాల మీదికి వదిలితే వాళ్లు మాత్రం ఏం చేస్తారు. అందుకే సినిమా తీసే ముందే డైరెక్టర్ తో గాని, హీరోతో గాని ఒకటికి పది సార్లు స్టోరీ గురించి చర్చించుకున్న తర్వాతనే సినిమా తీయాలి అని ఆయన ప్రస్తుతం ఒక డిసీజన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది…