Pawan Kalyan: మెగా ఫ్యామిలీలో చిరంజీవి(Chiranjeevi) తర్వాత అంత మంచి గుర్తింపు సంపాదించుకున్న ఏకైక నటుడు పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)… ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి..ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక టాప్ ప్రొడ్యూసర్ అంటే నచ్చదట. తనతో చాలా సినిమాలను తెరకెక్కించినప్పటికి ఆయన వైఖరి గాని ఆయన తెర వెనుక చేసే విషయాలు కూడా పవన్ కళ్యాణ్ కి అస్సలు ఇష్టం ఉండదట. ఇక ఆ ప్రొడ్యూసర్ చిరంజీవిని సైతం వెన్నుపోటు పొడిచాడనే ఉద్దేశంతోనే అతనితో చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదట. మరి ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు అనే విషయాలు అయితే బయటికి చెప్పడం లేదు. కానీ ఇండస్ట్రీ లో ఇదే వ్యవహారం నడుస్తుంది. మరి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తో మంచి సినిమాలను చేసి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆ టాప్ ప్రొడ్యూసర్ తో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదట. దానివల్లే పవన్ కళ్యాణ్ ఆయనకి డేట్స్ ఇవ్వడం లేదు…
ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఇటు పొలిటిషన్ గా, అటు సినిమా హీరోగా చేస్తు ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే సెట్స్ మీద ఉంచిన హరిహార విరమల్లు, ఓజి సినిమాలను తొందరగా ఫినిష్ చేసి ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని కూడా ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ సినిమాలన్నీ పూర్తి చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు అతని అభిమానులు అందరూ అభిమానంతో ఊగిపోతూ ఉంటారు…ఆయన సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తూ ఉంటారు.
ఒక్కసారి ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు విజిల్స్ తో థియేటర్ మొత్తం హారెతిస్తారు. ఆయన సినిమా రిలీజ్ అయితే చాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయడానికి వాళ్ళు ఒకటికి 10 సార్లు సినిమాలు చూస్తూ కలెక్షన్లను పెంచుతూ ఉంటారు. అలాంటి గొప్ప ఫ్యాన్స్ ఇంతవరకు ఏ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…