Homeక్రీడలుMS Dhoni: ధోని నుంచి అది కోరుకుంటున్న ఫ్యాన్స్.!

MS Dhoni: ధోని నుంచి అది కోరుకుంటున్న ఫ్యాన్స్.!

MS Dhoni
MS Dhoni

MS Dhoni: ఇండియన్ క్రికెట్లో మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ ఎటువంటిదో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని వైదొలగినప్పటికీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొనసాగుతుండడం ఆయన అభిమానులకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకు ధోని సారధిగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో ధోని ఎక్కువ బ్యాటింగ్ చేసేందుకు ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై జట్టు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ధోని నుంచి అభిమానులు ఆ ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో మరో పోరుకు రంగం సిద్ధమవుతోంది. బుధవారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నై చపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఈ సీజన్ లో రెండు జట్లు.. రెండేసి చొప్పున విజయాలతో సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చెన్నై జట్టు ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.

రఫ్ఫాడించిన పాడించిన రహనే..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి రెండు మ్యాచ్ లు కోసం ఎలాంటి మార్పులు చేయలేదు. మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ దూరమైన నేపథ్యంలో మూడో మ్యాచ్ కోసం తుది మార్పులు చేసింది. అజింక్య రహానేను తీసుకుంది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న రహానే మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇవాల్టి మ్యాచ్ లో కూడా రహానేను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. గతానికి భిన్నంగా రహానే బ్యాటింగ్ ఆడుతుండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చివరి మ్యాచ్ లో రహానే ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్ అతడికి మరిన్ని అవకాశాలను కల్పించేలా చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. టెస్టు, వన్డేలకే కాకుండా.. టీ20 లకు ఆడగల సామర్థ్యం తనలో ఉందని రహనే ఒక్క ఇన్నింగ్స్ తో నిరూపించుకోగలిగాడు.

అందుబాటులోకి మొయిన్ అలీ..

బుధవారం నాటి మ్యాచ్ కు మొయిన్ అలీ అందుబాటులోకి రానున్నాడు. ఆల్ రౌండర్ స్థానంలో అతని జట్టులోకి తీసుకుంటే.. బౌలర్లలో ఒకరిని తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి. డ్యేన్ ప్రిటోరియస్ లేదా సిసండ మలాగాల్లో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది. శ్రీలంకకు చెందిన బౌలర్ మహేష్ తీ.. జట్టు సెలక్షన్ కోసం అందుబాటులో ఉన్నప్పటికీ ఇవాల్టి మ్యాచ్ లో ఆడే అవకాశం దాదాపుగా లేనట్టేనని చెబుతున్నారు.

ధోని నుంచి భారీ ఇన్నింగ్స్ కోసం అభిమానుల చూపు..

ఇక చెన్నై జట్టు ఎక్కడ మ్యాచ్ జరిగిన భారీగా అభిమానులు వెళుతుంటారు. మహేంద్రసింగ్ ధోని చూసేందుకు, ఆయన ఆటలోని మెరుపులను ఆస్వాదించేందుకు అభిమానులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. గత మూడు మ్యాచ్ ల్లో ధోని భారీ ఇన్నింగ్స్ లో ఆడే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ లో అయినా భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. గత మూడు మ్యాచ్ లో చివరలో బ్యాటింగ్ కు దిగిన తనదైన స్టైల్ లో ఫినిష్ చేస్తూ వచ్చాడు ధోని. 20060 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు ధోనీ. అదే దూకుడుతో ఒక పూర్తిస్థాయి ఇన్నింగ్స్ ను ఆడితే చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆ కోరిక ఇవాల్టి మ్యాచ్ లో అయినా నెరవేరుతుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మార్పులు లేకుండానే బరిలోకి రాజస్థాన్..

చెన్నై తో మ్యాచ్ కు రాజస్థాన్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిచిన జట్టుతోనే చెన్నై సూపర్ కింగ్స్ పైన ప్రయోగించడం ఖాయం అయినట్టే చెబుతున్నారు. తుది జట్టులో స్పిన్నర్ కు స్థానం కల్పించాలి అనుకుంటే ఆడమ్ జంపా లేదా మురుగన్ అశ్విన్ ను ఆడించే అవకాశం ఉంది.

MS Dhoni
MS Dhoni

ఇవి జట్లు..

చెన్నై తుది జట్టులో.. రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), మిచెల్ శాంట్నర్, మహీశ్ తీక్షణ, రాజ్య వర్ధన్ హగర్గేకర్, ప్రిటోరియస్ ఆడే అవకాశం ఉంది.
రాజస్థాన్ జట్టులో.. జోష్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు సాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మియర్, ద్రువ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యజ్వెంద్ర చాహాల్, సందీప్ శర్మ ఆడే అవకాశం ఉంది.

Exit mobile version