
Anemia: మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆరు నెలల పిల్లల నుంచి ఆరేళ్ల వయసు వారిలో కూడా రక్తహీనత సమస్య ఉంటుంది. పిల్లల్లో 67 శాతం, మహిళల్లో 57 శాతం మందిలో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. రక్తహీనతకు కారణం ఎర్రరక్త కణాలు తగినంతగా ఉత్పత్తి కాకపోవడమే. కొందరిలో ఉత్పత్తి అయినా త్వరగా క్షీణిస్తుంటాయి. రక్తం కోల్పోవడంతోనే ఇలా జరుగుతుంది. చాలా మందిలో ఐరన్ లోపం వల్ల కూడా రక్తహీనత సమస్య వస్తుంది. దీంతో అలసట, ఆయాసం వంటి లక్షణాలు వేధిస్తుంటాయి.
ఐరన్ లోపం..
ఐరన్ లోపం వల్ల కూడా రక్తహీనత సమస్య కనిపిస్తుంది. ఎండు ద్రాక్షలో ఐరన్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం పరగడుపున తింటే మంచి ఫలితం ఉంటుంది. రక్తహీనత సమస్య రాకుండా పోతుంది. రోజు ఓ 10-15 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం పూట తిని నీళ్లు తాగాలి. ఎండు ద్రాక్ష అందం పెరగడానికి కారణమవుతుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం కూడా బాగా అందుతుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
నల్ల ద్రాక్షలను తీసుకోవడం వల్ల..
ఎండు నల్ల ద్రాక్షల ఐరన్ తో పాటు విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరం ఖనిజాలను గ్రహించుకునేలా చేస్తుంది. దీంతో వెంట్రుకలు బలంగా తయారవుతాయి. ఎండు ద్రాక్షలో పొటాషియం రక్తంలో సోడియం మోతాదులు తగ్గడంలో సాయపడుతుంది. అందుకే ఎండు ద్రాక్షలను తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంచుతుంది. ఎండు ద్రాక్ష గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా తగ్గిస్తుంది. గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేందుకు కారణమవుతుంది.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు..
నల్ల ఎండు ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో మనకు ఎన్నో రకాలుగా మేలు కలుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో పీచు అధికంగా ఉంటుంది. మలవిసర్జన సాఫీగా అయ్యేలా సాయపడుతుంది. నెలసరిలో వచ్చే ఇబ్బందులను దూరం చేస్తాయి. చాతీలో మంట రాకుండా చేస్తుంది. జీర్ణ సమస్యలు లేకుండా నిరోధిస్తుంది. ఇలా ఎండు ద్రాక్షల వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీంతో డ్రై ఫ్రూట్స్ తో మనకు కలిగే లాభాలు ఎక్కువగా ఉండటం వల్ల రోజువారీగా వాటిని తీసుకోవడం ఉత్తమం.