
Vastu Tips: మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పక్కా వాస్తు నియమాలు పాటిస్తాం. వాస్తు ప్రకారం లేకపోతే మనకు ఇబ్బందులు వస్తాయి. ఫలితంగా బతుకు బస్టాండ్ గా మారుతుంది. దీంతో మనం ఇల్లు కట్టుకునే సమయంలో అన్ని వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవలి. లేదంటే సమస్యలే చుట్టుముడతాయి. మనకు తెలియకుండానే అనేక దోషాల బారిన పడుతుంటాం. వాస్తు దోషాలు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాస్తు ప్రకారం అన్ని చూసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. కాదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
నిర్లక్ష్యం వద్దు
కొంతమంది పద్ధతులు తెలియక ఇబ్బందుల్లో పడతారు. మరికొంతమంది నిర్లక్ష్యంతో వ్యవహరిస్తారు. అందుకే వాస్తు రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాస్తు ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే నాశనం కలుగుతుందని తెలిసినా పట్టించుకోరు. మన వినాశనాన్ని మనమే కోరుకుంటుంటారు. కొన్ని రకాల వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దని తెలిసినా గమనించుకోకపోతే అంతేసంగతి. వాస్తు సిద్ధాంతాల ప్రకారం మనం నడుచుకుంటే ఎన్నో రకాల లాభాలు ఉంటాయి.
వాస్తు పద్ధతులు పాటించకపోతే..
ఇంట్లో ఆరు అంగుళాల కంటే ఎత్తయిన విగ్రహాలు ఉంచుకోకూడదు. వాస్తు ప్రకారం అలాంటివి ఉంటే మనకు తెలియకుండానే కుటుంబం నాశనం అవుతుంది. దీంతో రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుంది. ఆరు అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ఉంచుకుని నియమ నిష్టలతో పూజలు చేయాలి. పొరపాటున కూడా వాస్తు నిబంధనలు పట్టించుకోకపోతే మనకు ఇబ్బందులు రాక తప్పవు. అలా చేస్తే మన కుటుంబానికే మచ్చ వచ్చే అవకాశం పొంచి ఉంటుందని గ్రహించుకోవాలి.
సాలి గ్రామాన్ని ఉంచుకోకూడదు
సాలి గ్రామాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. సాలి గ్రామమంటే నున్నగా మెరిసే ఒక రాయి. ఇది ఎప్పుడు కూడా ఇంట్లో దాచుకోకూడదు. దీంతో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఈ రాయి శక్తివంతమైనదిగా భావిస్తారు. నునుపుగా తాబేలు నోరు తెరిచినట్లు ఉండే శ్రీమహావిష్ణువు శేషసాయిగా ఉండి దర్శనం ఇచ్చేలా ఉండే రాళ్లను సాలిగ్రామాలు అంటారు. అందుకే వాటిని ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు వాస్తు పండితులు. ఒకవేళ తీసుకొచ్చుకుంటే వాటికి కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇవి పాటించకపోతే అదృష్టం దరిద్రంగా మారుతుంది. కష్టాలు చవిచూడాల్సి వస్తుంది.

ముళ్ల చెట్లతో ముప్పే
ముళ్లచెట్టును కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. దీని వల్ల మనకు ముసలం వస్తుందని చెబుతున్నారు. ముళ్ల చెట్లు ఇంటి ఆవరణలో ఉంటే వారి జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముళ్ల చెట్లు ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు. ముళ్ల చెట్లు ఇంట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే చిక్కులు తప్పవు. ఈ నేపథ్యంలో ముళ్ల చెట్లు ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు. గులాబీ మొక్కకు మాత్రం మినహాయింపు ఉంటుంది. గులాబీ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవడాన్ని శుభ పరిణామంగానే చూస్తారు.