
Nagababu: టాలీవుడ్ లో నిర్మాతగా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా మెగా బ్రదర్ నాగబాబు గొప్పగా రాణించాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.కానీ ఈమధ్య ఆయన పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు,ఆయన వెండితెర మీద ఆఖరుగా కనిపించిన చిత్రం ‘సర్కారు వారి పాట’.ఈ సినిమా తర్వాత నాగబాబు ఏ సినిమాలో కూడా కనిపించలేదు.తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాలలో బిజీ గా గడుపుతూ ఎక్కువగా ద్రుష్టి అటువైపే కేంద్రీకరించడం తో సినిమాలను పెద్ద పట్టించుకోవట్లేదని టాక్.
అయితే కొంతకాలం గ్యాప్ తర్వాత ఆయన నటించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’.సంతోష్ శోభన్ హీరో గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.ఈ చిత్రానికి నిర్మాతగా చిరంజీవి కూతురు సుస్మిత వ్యవహరించింది.అయితే ఈ సందర్భంగా నాగబాబు కూడా పలు ప్రొమోషన్స్ మరియు ప్రత్యేక ఇంటర్వ్యూస్ ఈ సినిమా కోసం ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో హిట్ టాపిక్ గా మారింది.ఆయన మాట్లాడుతూ ‘మా ఇంట్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు, కానీ నాకు ఈమధ్య ఒక్కరు కూడా అవకాశం ఇవ్వడం లేదు.అలాంటి సమయం లో మా సుస్మిత నాకు అవకాశం ఇచ్చింది.కొంతకాలం గ్యాప్ తర్వాత నేను ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా ద్వారా మీ ముందుకి వచ్చాను.సుస్మిత నిర్మాణం లో నేను నటించడం ఇది మొదటిసారి కాదు, గతం లో ఆమె నిర్మించిన ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.

ఇంతకు ముందు నాగబాబు టీవీ షోస్ లో కూడా జడ్జి గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే.అందులో జబర్దస్త్ ఈయన కెరీర్ లో ఒక మైలు రాయిగా చెప్పుకోవచ్చు, సుమారుగా పదేళ్లు ఆ షో లో జడ్జీ గా కొనసాగాడు.ఒక ఆర్టిస్టుగా కంటే కూడా ఆయన జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సంపాదించాడని చెప్పొచ్చు.అయితే ఇప్పుడు అవన్నీ మానేసి తన ప్రధాన ద్రుష్టి మొత్తం రాజకీయాల వైపే పెట్టాడు.