https://oktelugu.com/

Chandrayaan 3: చంద్రయాన్ 3 మరో రికార్డ్.. ఏకకాలంలో యూట్యూబ్ లో వీక్షించిన 80 లక్షల మంది

ఇక చంద్రయాన్ 3 మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ప్రయోగంపై యూట్యూబ్లో ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ రికార్డ్ సృష్టించింది. ప్రయోగించిన 45 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23న చాంద్రయాన్ 3 జాబిల్లిపై సేఫ్ గా ల్యాండ్ అయ్యింది.

Written By:
  • Dharma
  • , Updated On : September 15, 2023 / 05:48 PM IST

    Chandrayaan 3

    Follow us on

    Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రశంసలు అందుకుంటోంది. జాబిలిపై ప్రయోగం చేసిన అగ్రదేశాల సరసన భారత్ చేరుకుంది.ప్రపంచ పరిశోధన రంగంలో మరో కలికితురాయిగా నిలిచింది.యావత్ ప్రపంచం భారత్ వైపు చూసేలా ఈ ప్రయోగం దోహదపడింది. జాబిలిపై సేఫ్ గా ల్యాండ్ అయిన ఈ ప్రయోగం శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ అగ్రగామిగా నిలిచేందుకు దోహదపడనుంది.

    ఇక చంద్రయాన్ 3 మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ప్రయోగంపై యూట్యూబ్లో ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ రికార్డ్ సృష్టించింది. ప్రయోగించిన 45 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23న చాంద్రయాన్ 3 జాబిల్లిపై సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. అయితే ఈ ప్రయోగాన్ని ఏకకాలంలో 80 లక్షల మంది వీక్షించారు. ఒకే సమయంలో ఈ ప్రయోగాన్ని చూశారు. ఆరోజు యూట్యూబ్లో ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ ను 8 మిలియన్ల మంది వీక్షించినట్లు యూట్యూబ్ తాజాగా ధ్రువీకరించింది.

    తాజాగా యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ స్పందించారు. ఈ ప్రయోగంతో సోషల్ మీడియాలో నమోదైన రికార్డు గురించి వివరించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు అభినందనలు తెలియజేశారు. ఏకకాలంలో 80 లక్షల మంది వీక్షించడం చిన్న విషయం కాదన్నారు. ఇది చంద్రయాన్ 3 గొప్పతనంగా చెప్పుకొచ్చారు. ఈ అరుదైన రికార్డ్ మమ్మల్ని మైమరిపించిందని ప్రకటించారు. మా ఆనందానికి పట్టపగ్గాలు లేవు అని చెప్పుకొచ్చారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.