Tollywood Writers: కన్నడ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ల సినిమాలను వాళ్లే డైరెక్షన్ చేస్తూ హీరోలుగా నటిస్తూ ఉంటారు అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే రిషబ్ శెట్టి ,రాజ్ బి శెట్టి ,రక్షిత్ శెట్టి వీళ్ళు ముగ్గురు కూడా మంచి కాన్సెప్టు లతో సినిమాలు చేసి కనడలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో మంచి హిట్లు అందుకుంటున్నారు.ఇక రీసెంట్ గా రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లను రాబట్టింది.ఇక ఈ సినిమాతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా హీరోగా డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు కాంతారా సినిమాకి తనే డైరెక్టర్ గా వ్యవహరించడం కూడా ఒక ముఖ్యమైన విషయం అనే చెప్పాలి ఇక వీళ్ళతోపాటు తెలుగులో ఉన్న కొద్ది మంది యంగ్ హీరోలు కూడా వాళ్లే స్వయంగా స్క్రిప్టు కూడా రాసుకోవడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే సిద్దు జొన్నలగడ్డ…ఈయన చేసిన చాలా సినిమాలకి ఈయనే రైటర్ గా వ్యవహరించాడు అందులో ముఖ్యంగా కృష్ణ అండ్ హిస్ లీల అలాగే డీజే టిల్లు లాంటి సినిమాలకి తనే రైటర్ గా చేస్తూనే హీరోగా కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యంగ్ స్టార్ గా ఇండస్ట్రీలో మంచి విజయాలను కూడా అందుకుంటున్నాడు…
ఇక ఈ లిస్టులో ఉన్న మరో హీరో అడవి శేషు ఈయన హీరోగా చేసిన సినిమాలన్నింటికీ ఈయన రైటర్ గా వ్యవహరించాడు అంటే పూర్తి సినిమా మొత్తానికి రైటర్ గా కాకుండా ఒక సినిమాకు సంబంధించిన స్క్రీన్ ప్లే రాయడం గాని లేదంటే డైలాగులు రాయడం గానీ ఇలాంటివి చేయడం జరిగింది ఈయన చేసే సినిమాలు ప్రతి సినిమా చాలా వెరైటీగా సస్పెన్స్ తో సాగుతూ ఉంటాయి అయిన కూడా ఈయన సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.ఇక ఈయన తెలుగులో వరుసగా సక్సెస్ లు కొడుతూ ఉన్నాడు…