https://oktelugu.com/

Jathi Ratnalu 2: అనుదీప్ డైరెక్షన్ లో జాతి రత్నాలు 2… ఎప్పుడు స్టార్ట్ అంటే..?

ఇక ఇదే సందర్భంలో నాగశ్విన్ కూడా సూపర్ హిట్ అయిన జాతి రత్నాలకి సీక్వెల్ గా జాతి రత్నాలు 2 సినిమా తీద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికోసం అనుదీప్ తో స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు కూడా చూడమని చెప్పినట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : September 15, 2023 / 05:44 PM IST

    Jathi Ratnalu 2

    Follow us on

    Jathi Ratnalu 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు వాళ్లకి నచ్చిన సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంటున్నారు ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లు విషయానికి వస్తే చాలామంది షార్ట్ ఫిలిమ్స్ తీసి ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా మారిపోతున్నారు అలాంటి వాళ్లలో అనుదీప్ ఒకరు ఈయన తీసిన ఒక షార్ట్ ఫిలిం ని డైరెక్టర్ నాగ అశ్విన్ చూసి ఆ షార్ట్ ఫిలిం ఆయనకు నచ్చడంతో అనుదీప్ ని పిలిపించి ఆయనతో ఒక సినిమా చేయమని దానికి తనే ప్రొడ్యూస్ కూడా చేస్తామని చెప్పాడు. ఇక దాంతో అనుదీప్ ఒక కామెడీ స్క్రిప్ట్ ని రెడీ చేసుకొని నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలను ముగ్గురిని మెయిన్ లీడ్ గా పెట్టి జాతి రత్నాలు అనే సినిమా తీశాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత అనుదీప్ శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమా తీశాడు ఈ సినిమా యావరేజ్ గా ఆడింది అయినప్పటికీ అనుదీప్ ఒక పెద్ద హీరో కోసం కథ రెడీ చేసుకుంటున్నాడు ఈ సినిమా కనుక వర్కౌట్ అయితే అనుదీప్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా మారిపోతాడు…

    ఇక ఇదే సందర్భంలో నాగశ్విన్ కూడా సూపర్ హిట్ అయిన జాతి రత్నాలకి సీక్వెల్ గా జాతి రత్నాలు 2 సినిమా తీద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికోసం అనుదీప్ తో స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు కూడా చూడమని చెప్పినట్టుగా తెలుస్తుంది.. ఇక జాతి రత్నాలు 2 సినిమా కనక తీసినట్టయితే ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అనే చెప్పాలి ఎందుకంటే ఈ సినిమాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం అనుదిప్ వెంకటేష్ తో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఆ ప్రాజెక్టు కనుక ఓకే అయితే ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఈ సీక్వెల్ సినిమా ఉంటుందని తెలుస్తుంది…