ఆంధ్రప్రదేశ్‌Deputy CM Pawan kalyan : అల్లు అర్జున్ అరెస్ట్ వార్త పవన్ చెవిలో వేసిన...

Deputy CM Pawan kalyan : అల్లు అర్జున్ అరెస్ట్ వార్త పవన్ చెవిలో వేసిన సీఎం చంద్రబాబు.. విని డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదీ!

Deputy CM Pawan kalyan :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ‘పుష్ప 2’ చిత్రం విడుదల ముందు రోజు అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్య థియేటర్ కి విచ్చేశాడు. ఆ సమయంలో అక్కడ అసంఖ్యాకంగా అభిమానులు చేరుకోవడంతో తొక్కిసిలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం శోచనీయంగా మారగా, అల్లు అర్జున్ పై ఆమె భర్త భాస్కర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో అల్లు అర్జున్ మరియు థియేటర్ యాజమాన్యంపై FIR నమోదు చేసిన పోలీసులు, రెండు రోజుల క్రితం థియేటర్ ఓనర్స్ ని అరెస్ట్ చేయగా, నేడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి నాంపల్లి హై కోర్టు లో హాజరు పరిచారు. ఈ కేసు పై విచారణ జరిపిన హై కోర్టు, అల్లు అర్జున్ కి 14 రోజుల పాటు రిమాండ్ ని విధించింది.

దీంతో అల్లు అర్జున్ ని పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు. బెయిల్ వస్తుందని ఆశించిన ఆయన అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది. ఇదంతా పక్కన పెడితే ఈ విషయాన్ని తెలుసుకున్న మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ మేనమామ పవన్ కళ్యాణ్ కూడా కాసేపటి క్రితమే హైదరాబాద్ కి విజయవాడ నుండి బయలుదేరాడు. నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజన్ 2047 డాక్యుమెంట్ ని విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం లో భారీ సభని ఏర్పాటు చేసి విడుదల చేసారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి హోదా లో పవన్ కళ్యాణ్ ఒక ప్రసంగం ఇచ్చి, ఆ తర్వాత చంద్ర బాబు నాయుడు పక్కన కూర్చోగా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెవిలో చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్ ఇస్తాడు.

దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయాన్ని చెప్పడం, దానికి పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్ ఇస్తూ అవునా, నిజమా అని స్పందించినట్టు ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం వంటివి జరిగినట్టు అభిమానులు సోషల్ మీడియా లో ఈ వీడియో ని పోస్ట్ చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ అరెస్ట్ పై తీవ్రమైన నిరసన వ్యక్తం చేసారు. ఇందులో కేవలం అల్లు అర్జున్ పొరపాటు మాత్రమే కాదు, పోలీసుల పొరపాటు కూడా ఉంది, కానీ ఒక్కడిని బలి చేయడం కరెక్ట్ కాదు, ఈ వ్యవహారం చూస్తుంటే అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి కావాలని కక్ష్య తీర్చుకున్నట్టు ఉందని అంటున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబాదుతూ తీవ్ర స్థాయిలో స్పందించే అవకాశం ఉందని కూడా ఆయన అభిమానులు అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

AP land allotment: ప్రైవేటు సంస్థలకు ఉచితంగా ప్రభుత్వ భూమినా? నిజమెంత?

AP land allotment: ప్రభుత్వ భూములకు సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాజెక్టులకు గాను కేటాయించే భూములను విక్రయించేందుకు, రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకనుంచి ఆ...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version